క్షమించండి.. వేరే దారి లేక మీ సైకిల్ ఎత్తుకెళ్తున్నా.. వలస కార్మికుడి లేఖ!

లాక్‌డౌన్ వేళ లక్షలాది మంది వలస కార్మికులు వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిని స్వరాష్ట్రాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నాయి.

క్షమించండి.. వేరే దారి లేక మీ సైకిల్ ఎత్తుకెళ్తున్నా.. వలస కార్మికుడి లేఖ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 9:21 PM

లాక్‌డౌన్ వేళ లక్షలాది మంది వలస కార్మికులు వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిని స్వరాష్ట్రాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నాయి. అయితే ఆ ప్రక్రియలో తమ పేరు రావడానికి ఆలస్యం అవుతుందని భావిస్తున్న చాలా మంది కాలి నడకన తమ స్వరాష్ట్రాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కాలి నడకన ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలనుకున్నాడు. అయితే నడవలేని స్థితిలో అతడి కొడుకు ఉన్నాడు. దీంతో మరో దారి లేకపోయిన ఓ తండ్రి.. ఓ ఇంటి బయట ఉంచిన సైకిల్‌ను ఎత్తుకెళ్లాడు. అలా దొంగతనంగా సైకిల్‌ను తీసుకెళ్లడానికి అతడి మనసు అంగీకరించకపోగా.. క్షమించాలంటూ ఓ లేఖను రాసి వెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

యూపీలోని బరేలీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తి దివ్యాంగుడైన కుమారుడితో కలిసి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా 50 రోజులుగా అక్కడే చిక్కుకుపోయిన అతడు ఇంటికి వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ తన కుమారుడితో కాలి నడకన వెళ్లడం కష్టమని భావించిన అతడు.. ఓ గ్రామంలో ఇంటి ముందున్న సైనిల్‌ను అపహరించి, క్షమించమని లెటర్ రాసి వెళ్లాడు. ఈ క్రమంలో ఆ ఇంటి యజమాని ముందు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేద్దామనుకున్నప్పటికీ.. లేఖ చదివాక తన మనసును మార్చుకున్నట్లు సమాచారం.

Read This Story Also: సస్పెండ్‌ అయిన ఆ డాక్టర్.. పూటుగా మద్యం తాగి..!

Latest Articles