ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్…. డిసెంబర్ 2 నుంచి 4వ వరకు వెబ్ ఆప్షన్లు

కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. కౌన్సిలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 1న విడుదల చేశారు.

ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్.... డిసెంబర్ 2 నుంచి 4వ వరకు వెబ్ ఆప్షన్లు
Follow us

|

Updated on: Dec 01, 2020 | 7:19 PM

కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. కౌన్సిలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 1న విడుదల చేశారు. డిసెంబర్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయింత్రం 7 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచిన తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు అందరూ వెబ్ కౌన్సెలింగ్ కు అర్హులని ప్రకటించారు. కళాశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. కళాశాల వారీగా ఖాళీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని తెలిపారు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైటు www .knruhs.telangana.gov.in ను సంప్రదించాలని తెలిపారు.