Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

కొండపోచమ్మ సాగర్ పర్యటనకు సీఎం కేసీఆర్..!

KCR Visit To Kaleshwaram Irrigation project Kondapochamma sagar, కొండపోచమ్మ సాగర్ పర్యటనకు సీఎం కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోదావరి జలాలను తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్‌ పంప్‌హౌసే చివరిది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్‌ పంప్‌హౌ్‌సలో మోటార్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొదటి పంప్‌హౌ్‌స నుంచి సుమారు 88 మీటర్ల నుంచి నీటిని ఇప్పటికే ఎత్తిపోయడం మొదలైంది.
ఇక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, ఆ తర్వాత మల్లన్నసాగర్‌ వరకూ నీటిని తీసుకొచ్చారు. ఈ మధ్యే అక్కారం మోటార్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించి మర్కూక్‌ పంప్‌హౌస్ కు నీటిని చేర్చారు. మర్కూక్‌లో మోటార్లను ప్రారంభించడం ద్వారా నేరుగా కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీరు చేరనుంది. దీని ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ 618 మీటర్లు. అంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 88 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎగువకు నీటిని తీసుకురానున్నారు. మొత్తంగా చూస్తే 530 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్‌ చేయనున్నారు. కొండపోచమ్మకు చేరిన నీరు గ్రావిటీ ద్వారా పలు ప్రాంతాలకు వెళ్లనుంది. దీంతో అత్యధిక ఎత్తు వరకు రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలను అందించిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుకు దక్కుతుంది.

Related Tags