Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది.
  • కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తున్నదని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

KCR among rare 8 CMs: ఆ ఎనిమిది మందిలో కేసీఆర్ ఒకరు.. సూపర్!

రాజకీయ విభేధాలున్నా కేంద్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్దపీట వేస్తోందని మరోసారి ప్రూవ్ అయింది. అత్యంత అరుదుగా జరిగే విందుకు దేశంలోని ముఖ్యమంత్రులలో కేవలం ఎనిమిది మందికి ఆహ్వానం అందగా అందులో కేసీఆర్ ఒకరు కావడం విశేషం.
kcr one among eight cms, KCR among rare 8 CMs: ఆ ఎనిమిది మందిలో కేసీఆర్ ఒకరు.. సూపర్!

KCR invited for President lunch for Donald Trump: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన ఘనత సాధించబోతున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన నివాసంలో ఇవ్వనున్న విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. కేవలం వంద మంది మాత్రమే హాజరు కానున్న రాష్ట్రపతి విందుకు కేవలం ఎనిమిది మంది ముఖ్యమంత్రులను మాత్రమే ఆహ్వానిస్తుండగా.. అందులో కేసీఆర్ ఒకరు కావడం విశేషం.

ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న డొనాల్డ్ ట్రంప్… మొదటి రోజంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా భావిస్తున్న అహ్మాదాబాద్ స్టేడియంను ట్రంప్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళ నుంచి ట్రంప్.. మర్నాడు ప్రపంచ వింతలలో ఒకటిగా భావించే ఆగ్రా తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. ఫిబ్రవరి 24 రాత్రి గానీ, 25 మధ్యాహ్నం గానీ రాష్ట్రపతి కోవింద్ అమెరికా అధ్యక్షుని గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌కు ఇస్తున్న విందుకు హాజరై ఆతిథ్యం స్వీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి ఇన్విటేషన్ అందినట్లు సీఎంఓ ధృవీకరించింది. ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు కేవలం వంద మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకే రాష్ట్రపతి ఆహ్వానం పంపారు. వీరితో పాటు దేశంలో అస్సాం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణా కలిపి మొత్తం ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం పంపారు.

మోదీ ప్రభుత్వంతో రాజకీయంగా చాలా అంశాల్లో విభేదిస్తున్న కేసీఆర్, నవీన్ పట్నాయక్, ఉద్ధవ్ థాక్రే వంటి సీఎంలకు ఆహ్వానం రావడం విశేషం. ఇటీవల కాలంలో బీజేపీకి చాలా దగ్గరైనట్లు కనిపిస్తున్న ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం రాకపోవడంపై రాజకీయపరంగా చర్చ మొదలైంది.

Read this also: ఏపీలో సిట్ ఏర్పాటుపై రాజకీయ దుమారం Political uproar over SIT investigation in Andhra

Related Tags