మెగాస్టార్‌కు అచ్చొచ్చిన టైటిల్‌తో.. కలెక్షన్స్ కొల్లగొడుతున్న కార్తీ ‘ఖైదీ’

తమిళ హీరో కార్తీ లేటెస్ట్ చిత్రం ‘ఖైదీ’. తమిళ, తెలుగు భాషల్లో నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్, పాటలు లేకుండా.. పూర్తి ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ఆదరిస్తారా అనే అనుమానులు మొదట వ్యక్తం అయ్యాయి. తమిళంలో అయితే ఇలాంటి సబ్జెక్టులు ఓకే గానీ.. తెలుగువారు పెద్దగా ఆసక్తి చూపించారు. కానీ అనూహ్యంగా ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. భారీ కలెక్షన్స్ దిశగా అడుగులు […]

మెగాస్టార్‌కు అచ్చొచ్చిన టైటిల్‌తో.. కలెక్షన్స్ కొల్లగొడుతున్న కార్తీ 'ఖైదీ'
Follow us

|

Updated on: Oct 26, 2019 | 6:29 PM

తమిళ హీరో కార్తీ లేటెస్ట్ చిత్రం ‘ఖైదీ’. తమిళ, తెలుగు భాషల్లో నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్, పాటలు లేకుండా.. పూర్తి ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ఆదరిస్తారా అనే అనుమానులు మొదట వ్యక్తం అయ్యాయి. తమిళంలో అయితే ఇలాంటి సబ్జెక్టులు ఓకే గానీ.. తెలుగువారు పెద్దగా ఆసక్తి చూపించారు. కానీ అనూహ్యంగా ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. భారీ కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది.

మొదటి రోజు.. మార్నింగ్ అండ్ నూన్ షోస్ కేవలం 25 శాతం ఆక్యుపెన్సీ కూడా లేవని సమాచారం. అయితే మౌత్ టాక్‌తో, అటు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఫస్ట్ షో నుంచి ఏకంగా 60 శాతంకు పైగా థియేటర్లలో ఆక్యుపెన్సీ వచ్చిందని తెలుస్తోంది. కొన్నింటిలో అయితే ఏకంగా హౌస్‌ఫుల్ బోర్డ్స్ ప్రత్యేకం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘బిగిల్’ కంటే ‘ఖైదీ’కే మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పాలి. అటు తమిళనాడులో కూడా ఈ సినిమా విజయ్ సినిమాకు గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం.
ఇక ఈ సినిమాకు.. మెగాస్టార్ ‘ఖైదీ’కి మధ్య ఓ వత్యాసం ఉంది. 1983లో విడుదలైన చిరు ‘ఖైదీ’కి మొదట అంచనాలు లేవు. అంతేకాక యావరేజ్ వసూళ్లు కూడా నమోదు అయ్యాయట. ఇక ఆ తర్వాత మౌత్ టాక్‌తో ఇండస్ట్రీ హిట్ మాత్రమే కాదు రికార్డులు కూడా బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఆ సినిమా టైటిల్ పెట్టుకున్న కార్తీ సినిమాకు కూడా మొదట పెద్దగా స్పందన లేకున్నా.. మౌత్ పబ్లిసిటీతో అనూహ్యంగా వసూళ్లు పెరుగుతుండటంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలా ఒక్కటే కాదు.. రీసెంట్‌గా మెగాస్టార్ సినిమా టైటిల్స్ పెట్టుకుని రిలీజైన పలు సినిమాలు  కమర్షియల్‌గా హిట్స్ దక్కించుకోవడం విశేషం.