కార్గిల్ అమరవీరులకు రాజ్ నాథ్ సింగ్ ఘన నివాళి

1999 లో జరిగిన  కార్గిల్ యుధ్ధంలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. నాటి యుధ్ధంలో అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించి అసువులు బాసిన సైనికులకు నా వినమ్ర శ్రధ్ధాంజలి అని ఆయన ట్వీట్ చేశారు. సైనికుల మాదిరే మనం కూడా క్రమశిక్షణ, అంకిత భావం కలిగిఉండాలని ఆయన కోరారు. దేశ సరిహద్దుల్లో వారు మన రక్షణ కోసం శ్రమిస్తుంటే మనం శాంతి, సామరస్యాలతో ఉండాలని. ఇవే వారికి మనమిచ్ఛే నివాళి […]

కార్గిల్ అమరవీరులకు రాజ్ నాథ్ సింగ్ ఘన నివాళి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 26, 2020 | 10:56 AM

1999 లో జరిగిన  కార్గిల్ యుధ్ధంలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. నాటి యుధ్ధంలో అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించి అసువులు బాసిన సైనికులకు నా వినమ్ర శ్రధ్ధాంజలి అని ఆయన ట్వీట్ చేశారు. సైనికుల మాదిరే మనం కూడా క్రమశిక్షణ, అంకిత భావం కలిగిఉండాలని ఆయన కోరారు. దేశ సరిహద్దుల్లో వారు మన రక్షణ కోసం శ్రమిస్తుంటే మనం శాంతి, సామరస్యాలతో ఉండాలని. ఇవే వారికి మనమిచ్ఛే నివాళి అని ఆయన అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి  వద్ద రాజ్ నాథ్ సింగ్ తో బాటు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, త్రివిధ దళాల అధిపతులు కూడా శ్రధ్ధాంజలి ఘటించారు.

21 ఏళ్ళ క్రితం జులై 26 న కార్గిల్ లో పాక్ చొరబాటుదారులు అక్రమించిన  భారత భూభాగాలను ఇండియన్  ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది.