పెళ్లితరవాత వరుస సినిమాలతో బిజీకానున్న చందమామ.. ఇక పై అలాంటి సినిమాలు చేయనంటున్న కాజల్

ఇటీవలే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లిచేసుకుంది అందాల చందమామ కాజల్. తన మనసుకు నచ్చిన గౌతమ్ కిచ్లును వివాహమాడింది.

పెళ్లితరవాత వరుస సినిమాలతో బిజీకానున్న చందమామ.. ఇక పై అలాంటి సినిమాలు చేయనంటున్న కాజల్
Follow us

|

Updated on: Dec 02, 2020 | 2:35 PM

ఇటీవలే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లిచేసుకుంది అందాల చందమామ కాజల్. తన మనసుకు నచ్చిన గౌతమ్ కిచ్లును వివాహమాడింది ఈ కుర్రది. ఇటీవల హనీమూన్ ను పూర్తిచేసుకున్న ఈ వయ్యారి తిరిగి సినిమాల్లో బిజీ అవ్వడానికి సిద్దమవుతుంది. పెళ్లితర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ప్రకటించేసింది. అయితే పెళ్లి తర్వాత చేయబోయే సినిమాలను ఆచితూచి ఎంచుకోవాలనుకుంటుందట.

గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని భావిస్తుంది కాజల్. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో త్వరలో కాజల్ జాయిన్ అవ్వనుంది. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు నటిస్తున్న ‘మోసగాళ్లు’ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో విష్ణు చెల్లెలిగా కనిపించనుంది కాజల్. అలాగే తమిళ్ లో శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ‘భారతీయుడు 2’లో చేస్తుంది. వీటితో పాటు ఇప్పటివరకు టచ్ చేయని హారర్ జోనర్ లో కూడా ఓ మూవీ చేయబోతుందట ఈ ముద్దగుమ్మ.