కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతున్న సమయంలో వచ్చి తనదైన శైలి జోక్స్‌తో ప్రజలను కూల్ చేశాడు కేఏ పాల్. ఆ తరుణంలో సోషల్ మీడియాలో ఈయన చిత్రాలు హోరెత్తాయి. అయితే అవేవి పాల్‌కు ఓట్ల వర్షం కురిపించలేదు. ప్రజాశాంతి పార్టీ స్థాపించి.. రాష్ట్రంలోని అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టినా.. ఒక్కచోటా డిపాజిట్ దక్కలేదు, ఇక స్వయంగా కేఏ పాల్ నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగగా ఆయనకు 281 ఓట్లు పడ్డాయి. నర్సాపురం లోక్‌సభ స్థానానికి […]

కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?
Follow us

|

Updated on: May 24, 2019 | 10:14 AM

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతున్న సమయంలో వచ్చి తనదైన శైలి జోక్స్‌తో ప్రజలను కూల్ చేశాడు కేఏ పాల్. ఆ తరుణంలో సోషల్ మీడియాలో ఈయన చిత్రాలు హోరెత్తాయి. అయితే అవేవి పాల్‌కు ఓట్ల వర్షం కురిపించలేదు. ప్రజాశాంతి పార్టీ స్థాపించి.. రాష్ట్రంలోని అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టినా.. ఒక్కచోటా డిపాజిట్ దక్కలేదు, ఇక స్వయంగా కేఏ పాల్ నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగగా ఆయనకు 281 ఓట్లు పడ్డాయి. నర్సాపురం లోక్‌సభ స్థానానికి ఆయనకు 2987 ఓట్లు దక్కాయి.  ఫ్యాన్ గాలి ముందు హెలికాప్టర్ జోరు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.