మహాఘట్‌బంధన్‌కు జీతన్‌ రాం మాంఝీ రాం రాం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన మహాఘట్‌బంధన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కూటమి నుంచి మాజీ సీఎం జీతన్‌ రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌) వైదొలిగింది.

మహాఘట్‌బంధన్‌కు జీతన్‌ రాం మాంఝీ రాం రాం
Follow us

|

Updated on: Aug 20, 2020 | 7:57 PM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన మహాఘట్‌బంధన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కూటమి నుంచి మాజీ సీఎం జీతన్‌ రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్‌ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌) వైదొలిగింది. గురువారం జరిగిన ఆ పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంలో కో-ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేయాలన్న తన అభ్యర్థనపై ఎలాంటి స్పందన రాకపోవడంతో అసంతృప్తితో మాంఝీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

‘‘కో ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని మేం ఎప్పటి నుంచో కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తన సొంత అభిప్రాయాలకే పెద్దపీట వేస్తున్నారు’’ అని మాంఝీ తనయుడు, ఎమ్మెల్సీ సంతోష్‌ సుమన్‌ పేర్కొన్నారు. చిన్న పార్టీలను తేజస్వీయాదవ్‌ పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ), వికాషీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) ఈ కూటమిలో ప్రస్తుతం భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం భారీగా ఉంటుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.