జనతా కర్ఫ్యూ : దేశవ్యాప్తంగా రైళ్లు బంద్…

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ  ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని సూచించారు. ఈ క్రమంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే 1330 రైళ్లతో పాటు 2400 ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.   అయితే, ప్రయాణం ప్రారంభించిన రైళ్లు తమ గమ్యాన్ని చేరుకోవడానికి […]

జనతా కర్ఫ్యూ : దేశవ్యాప్తంగా రైళ్లు బంద్...
Follow us

|

Updated on: Mar 20, 2020 | 10:36 PM

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ  ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు దేశంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని సూచించారు. ఈ క్రమంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే 1330 రైళ్లతో పాటు 2400 ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.   అయితే, ప్రయాణం ప్రారంభించిన రైళ్లు తమ గమ్యాన్ని చేరుకోవడానికి అనుమతించబడతాయి. ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా స్టేషన్లలో ఉండాలని కోరుకునే ప్రయాణీకులకు స్టేషన్లు, వెయిటింగ్ ఏరియాల్లో వసతి కల్పిస్తామని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) తెలిపింది.

అనవసరమైన ప్రయాణాలను కూడా నిరోధించేందుకు ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్మెంట్ గదులు, క్యాటిరింగ్ సహా ఇతర స్టాటిక్ యూనిట్లను నిరవధిక కాలానికి మూసివేయాలని ఐఆర్‌సిటిసి నిర్ణయించింది. దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సేవలు ఆదివారం నుండి నిలిపివేయనున్నట్లు తెలిపింది. అవసరాన్ని బట్టి స్నాక్స్, టీ,  కాఫీ వంటి ప్యాక్ చేసిన వస్తువులను మాత్రమే అందించవచ్చు. సర్వీసులు నిలిపివేయబడుతోన్న నేపథ్యంలో  సిబ్బందితో మానవతా ద్రుక్పథంతో వ్యవరించమని క్యాటరింగ్ కాంట్రాక్టర్లను రైల్వే అభ్యర్థించింది. 

అంతేకాదు..భారత  రైల్వే మార్చి 20 నుండి మార్చి 31 మధ్య మరో 84 రైళ్లను రద్దు చేసింది. రద్దు చేసిన రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ఉన్న ప్రయాణీకులందరికీ రైల్వే శాఖ సమాచారాన్ని చేేరవవేస్తుంది. ఈ రైళ్లకు కాన్సిలేషన్ ఫీజు కూడా తీసుకోవడం లేదు. ప్రయాణీకులకు 100 శాతం వాపసు లభిస్తుంది అని ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపారు.