Earthquake in Jammu & Kashmir: జ‌మ్మూకాశ్మీర్‌లో భూకంపం

జ‌మ్మూకాశ్మీర్‌లో భూమి కంపించింది. బుధ‌వారం తెల్ల‌వారు జామున 5.08 గంట‌ల‌కు క‌శ్మీర్‌లోని హెన్లీకి స‌మీపంలో భూకంపం సంభ‌వించింది. మాగ్నిట్యూడ్‌పై దీని తీవ్ర‌త 4.1గా న‌మోద‌యింది. హెన్లీకి ఈశాన్యంగా 263 కిలో మీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం..

Earthquake in Jammu & Kashmir: జ‌మ్మూకాశ్మీర్‌లో భూకంపం
Earthquake
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 9:29 AM

Earthquake in Jammu & Kashmir: జ‌మ్మూకాశ్మీర్‌లో భూమి కంపించింది. బుధ‌వారం తెల్ల‌వారు జామున 5.08 గంట‌ల‌కు క‌శ్మీర్‌లోని హెన్లీకి స‌మీపంలో భూకంపం సంభ‌వించింది. మాగ్నిట్యూడ్‌పై దీని తీవ్ర‌త 4.1గా న‌మోద‌యింది. హెన్లీకి ఈశాన్యంగా 263 కిలో మీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. భూ అంత‌ర్భాగంలో 240 కిలో మీట‌ర్ల లోతులో భూమి కంపించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే ఈ భూకంపం ద్వారా ఎలాంటి ప్రాణ‌, ఆస్థి న‌ష్టం జ‌ర‌గ‌లేదని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ పేర్కొంది. కాగా ఈ మ‌ధ్య దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభ‌విస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో, ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలతో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే.. ఈ భూకంపాలు మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.

Read More:

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో త‌మిళ‌నాడు మంత్రి

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ