మామిడి పిక్కలతో ఆ సమస్యలకు చెక్..
TV9 Telugu
26 April 2024
దీర్ఘకాలిక ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. అతిసారంతో బాధపడేవారు మామిడిపండు గింజను తింటే.. ఫలితం ఉంటుంది.
చాలా కాలంగా విరేచనాలు, ఇతర ఉదర సమస్యలు ఉన్నవారు.. మామిడి గింజలను ఎండబెట్టి చూర్ణం చేసి తింటే ప్రయోజనం ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెతో వీటి పొడిని కలపండి. ఈ మిశ్రమం అనేక ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ సమస్యను నియంత్రించడంలో మామిడి గింజల పాత్ర ఉంది.
మామిడికాయ గింట పొడిని తినడం, లేదా పొడిని పాలలో వేసుకుని తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయొచ్చు.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో.. ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు.
గుండె సమస్యలను నియంత్రించడంలో మామిడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ ఒక చెంచా ఎండు యాలకుల పొడిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎసిడిటీ సమస్యను అధిగమించడానికి.. ఎసిడిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో మామిడి గింజలు అద్భుతంగా పని చేస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి