మరో ‘ఘాజీ’ అటాక్‌కు సిద్ధమైన పాక్..!

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలిపేందుకు పాక్ అధికారులు నానా ప్రయత్నాలు చేశారు. అయితే అన్ని దేశాలు పాక్‌కు హ్యాండిచ్చాయి. సహాయం కాదు కదా.. కశ్మీర్ అన్నది భారత అంతర్గత సమస్య.. అందులో మేము తలదూర్చమంటూ మొహం మీదే చెప్పేశాయి. దీంతో చేసేదేం లేక ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధం చేసేందుకు మేమెప్పుడూ […]

మరో ‘ఘాజీ’ అటాక్‌కు సిద్ధమైన పాక్..!
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 12:02 PM

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలిపేందుకు పాక్ అధికారులు నానా ప్రయత్నాలు చేశారు. అయితే అన్ని దేశాలు పాక్‌కు హ్యాండిచ్చాయి. సహాయం కాదు కదా.. కశ్మీర్ అన్నది భారత అంతర్గత సమస్య.. అందులో మేము తలదూర్చమంటూ మొహం మీదే చెప్పేశాయి. దీంతో చేసేదేం లేక ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధం చేసేందుకు మేమెప్పుడూ ముందు ఉండమని నీతులు చెబుతూ.. భారత్‌పై దాడి చేసేందుకు ఒక్కో ప్రణాళికను రచిస్తున్నారు పాక్ అధికారులు.

కాగా పాక్‌కు చెందిన కమాండోలు భారత జలాల్లోకి ప్రవేశించబోతున్నట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో దాడి చేసేందుకు పాక్ అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తోందని.. ఈ క్రమంలో ఘాజీ తరహా అటాక్‌కు వారు సిద్ధంగా ఉన్నారని ఐబీ అధికారులు తెలిపారు. దేశంలో అతిపెద్ద పోర్టుగా పేరొందిన ముంద్రాలోకి(గుజరాత్) పాక్ కమాండోలు ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో ఆ పోర్టులో పాటు దేశవ్యాప్తంగా మిగలిన పోర్టులను అప్రమత్తం చేశారు భారత నేవీ అధికారులు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్  సముద్ర మార్గంలో దాడులు చేసేందుకు సిద్ధమౌతోందని.. ఇందుకోసం ఈ ఉగ్ర ముఠా జలాంతర విభాగం ఏర్పాటు చేసిందని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మొన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సముద్ర మార్గాల నుంచి చొరబాటుదారులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతను పెంచామని.. పాక్ చర్యలను తాము తిప్పికొడతామని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ