Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

ఇంత నీచమా చంద్రబాబూ ? నిప్పులు కక్కిన జగన్

jaganmohan reddy fires at chandrababu in eluru, ఇంత నీచమా చంద్రబాబూ ? నిప్పులు కక్కిన జగన్

చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం జగన్మోహన్  రెడ్డి. పట్టపగలే నిస్సిగ్గుగా తమ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనాన్ని వీడి.. పచ్చి బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏలూరు లో వైఎస్సార్ వాహన మిత్ర సభలో సీఎం జగన్ చంద్రబాబు పై హాట్ కామెంట్స్ చేశారు జగన్. అక్టోబర్ 2 న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు నన్ను బాధించాయన్నారు జగన్. గాంధీ జయంతి నాడు మందు షాపులు తెరిచాము అంటూ చంద్రబాబు అబండాలు వేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడ మంచి పేరు వస్తుందోనని పట్టపగలే అబద్దాలు ఆడుతున్నారు చంద్రబాబు అంటూ సీఎం మండిపడ్డారు. ఇన్ని మాటలు మాట్లాడినా ఆ బాధలు ప్రజల ముఖాల్లో ఆనందం చూస్తే పోతుందని చెప్పారు. అక్టోబర్ 2 న రాష్ట్రంలో సచివాలయాలు గొప్పగా ప్రారంభించామని జగన్ వెల్లడించారు. గాంధీ జయంతి నాడు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికి మద్యం పై యుద్ధం ప్రకటించామని చెప్పారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు కనిపించాయని జగన్ చెప్పుకొచ్చారు. తెలుగు దేశం హయాంలో గ్రామాల్లో మంచినీళ్లు లేకపోయినా మద్యం మాత్రం దొరికేదాని జగన్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే బెల్టు షాపులు ఎత్తివేశామని,  20 శాతం మద్యం షాపులు తగ్గించామని ఏపీ సీఎం వివరించారు.