
Dinesh Karthik Telugu: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ గెలిచింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ మధ్యలో కోల్‌కతా క్రికెటర్ దినేష్ కార్తీక్, అంపైర్ షంషుద్దీన్ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది. చెన్నై టీమ్‌కి చెందిన శామ్ కుర్రన్ బౌలింగ్ వేసిన తరువాత.. దినేష్ కార్తీక్ ‘వైడ్ కాదా..?’ అని అడిగారు. అందుకు స్పందించిన అంపైర్ షంషుద్దీన్.. ”లోపల, చానా లోపల, కొంచెం కూడా కాదు” అని సమాధానం ఇచ్చారు.(ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో )
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షంషుద్దీన్ హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కాగా.. తమిళనాడుకు చెందిన దినేష్ కార్తీక్‌కి తెలుగు వచ్చా..? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందుకు స్పందిస్తున్న కొంతమంది దినేష్ కార్తీక్ పూర్వీకులు తెలుగు వారే అని.. మరికొందరేమో కార్తీక్‌కి తెలుగు, తమిళం, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ వచ్చొని కామెంట్లు పెడుతున్నారు. ( కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 1,531 కొత్త కేసులు.. 6 మరణాలు )