ఏబీ లాగి పెట్టి కొట్టిన బాల్‌ స్టేడియం బయటపడింది

టీ-20 క్రికెట్‌ వచ్చాక బౌండరీలు, సిక్సర్లు చాలా ఈజీగా బాదేస్తున్నారు బ్యాట్స్‌మెన్‌! సిక్సర్లలో భారీ సిక్సర్లు కొట్టేవారు కొందరే ఉంటారు.. అలాంటివారిలో ఏబీ డివిలియర్స్‌ ఒకరు.. అతను కానీ లాగి పెట్టి కొడితే బాల్‌ స్టేడియం అవతలకెళ్లి పడాల్సిందే!

ఏబీ లాగి పెట్టి కొట్టిన బాల్‌ స్టేడియం బయటపడింది
Follow us

|

Updated on: Oct 13, 2020 | 10:28 AM

టీ-20 క్రికెట్‌ వచ్చాక బౌండరీలు, సిక్సర్లు చాలా ఈజీగా బాదేస్తున్నారు బ్యాట్స్‌మెన్‌! సిక్సర్లలో భారీ సిక్సర్లు కొట్టేవారు కొందరే ఉంటారు.. అలాంటివారిలో ఏబీ డివిలియర్స్‌ ఒకరు.. అతను కానీ లాగి పెట్టి కొడితే బాల్‌ స్టేడియం అవతలకెళ్లి పడాల్సిందే! నిన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడి బ్యాటింగ్‌ విన్యాసాన్ని, విధ్వంసాన్ని చూసినవారికి చూడముచ్చట అనిపించింది.. 23 బంతుల్లోనే ఆఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్న డివిలియర్స్‌ 33 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.. ఇందులో నాలుగు బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.. రెండు సార్లు బాల్‌ను స్టేడియం అవతలికి బాదేశాడు.. 16వ ఓవర్‌లో నగర్‌కోటి వేసిన నాలుగో బాల్‌ను అలవోకగా స్టేడియం వెలుపలికి తరలించాడు.. బంతి స్టేడియం బయటకు వెళ్లి ఓ కారుకు తగిలింది.. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.. బాల్‌ బయటపడేసరికి ట్రాఫిక్‌ కూడా జామ్‌ అయ్యింది.. దటీజ్‌ ఏబీ అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు డివిలియర్స్‌ను!