ఐపీఎల్ టోర్నీలో 50 అర్థశతకాలతో డేవిడ్‌ వార్నర్‌ రికార్డు

క్రికెట్‌లో సెంచరీ అయినా, హాఫ్‌ సెంచరీ అయినా బ్యాట్స్‌మన్‌కి గొప్పే! ఇక టీ-20 ఫార్మట్‌లో అయితే హాఫ్‌ సెంచరీకి చాలా విలువ! అందుకే డేవిడ్‌ వార్నర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విలువైన ఆటగాడయ్యాడు..

ఐపీఎల్ టోర్నీలో 50 అర్థశతకాలతో డేవిడ్‌ వార్నర్‌ రికార్డు
Follow us

|

Updated on: Oct 09, 2020 | 1:58 PM

క్రికెట్‌లో సెంచరీ అయినా, హాఫ్‌ సెంచరీ అయినా బ్యాట్స్‌మన్‌కి గొప్పే! ఇక టీ-20 ఫార్మట్‌లో అయితే హాఫ్‌ సెంచరీకి చాలా విలువ! అందుకే డేవిడ్‌ వార్నర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విలువైన ఆటగాడయ్యాడు.. ఆస్ట్రేలియాకు చెందిన ఈ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ హాఫ్‌ సెంచరీలతో అరుదైన ఘనతను సాధించాడు.. ఈ లీగ్‌లో 50 సార్లు 50కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు.. నిన్న దుబాయ్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ చెలరేగిపోయాడు.. 40 బంతుల్లో అయిదు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు.. 2009 నుంచి ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ఆడుతున్న ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఇప్పటికే మూడుసార్లు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ముమ్మార్లు ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.. బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకోవడం వల్ల 2018లో జరిగిన ఐపీఎల్‌ ఆడలేకపోయాడు.. లాస్టియర్‌ నిషేధం తొలగిపోయిన వెంటనే నేరుగా ఐపీఎల్‌లోనే ఆడాడు వార్నర్‌.. వచ్చి రావడంతోనే 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు సాధించాడు.. నిషేధం లేకపోయి ఉంటే 2018లో కూడా దుమ్ముదులిపేవాడేమో! అన్నట్టు పంజాబ్‌ అంటే వార్నర్‌కు ఎందుకో తెగ ఇష్టం.. అందుకే ఆ జట్టుపై వరుసగా తొమ్మిది హాఫ్‌ సెంచరీలు చేయగలిగాడు.. ఇది కూడా ఓ రికార్డు మరి! 50 హాఫ్‌ సెంచరీలు చేయడానికి వార్నర్‌కు 132 ఇన్నింగ్స్‌ పట్టాయి..సెకండ్‌ప్లేస్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ 174 ఇన్నింగ్స్‌లో 42 హాఫ్‌ సెంచరీలు చేశాడు.. ముంబాయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ, చెన్నై ఆటగాడు సురేశ్‌ రైనా 189 ఇన్నింగ్స్‌లలో 39 అర్థశతకాలు చేసి మూడో స్థానంలో నిలిచారు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ 147 ఇన్నింగ్స్‌లో 38 హాఫ్‌ సెంచరీలు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు..