బీజేపీలోకి రండి ‘మంత్రి పదవి గ్యారెంటీ’: బుద్ధాకు సోము బంపర్‌ ఆఫర్

Interesting Discussion between TDP MLC Buddha Venkanna and Somu Veerraju in AP Council lobby, బీజేపీలోకి రండి ‘మంత్రి పదవి గ్యారెంటీ’: బుద్ధాకు సోము బంపర్‌ ఆఫర్

ఏపీ శాసనమండలిలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఎప్పుడూ నిప్పు, ఉప్పులా ఉండే ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకోవటంతో.. ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న, బీజేపీ నేత సోము వీర్రాజుల మధ్య లాబ్లీలో సరదా సంభాషణ జరిగింది. మొదట ఒకరినొకరు పలకరించుకరించుకున్నారు. ముందుగా.. బుద్ధాతో మాటలు కలిపిన బీజేపీ నేత సోము వీర్రాజు.. ఆయనకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారట. ‘తమరు మా పార్టీలో చేరితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి గ్యారెంటీ’ అని సోము వీర్రాజు అన్నారట. దీనికి.. బుద్ధా వెంకన్న.. ‘మీరే టీడీపీలోకి రండి.. మా పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలోకి తీసుకుంటామని’ కౌంటర్‌ ఇచ్చి.. కాసేపు నవ్వుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *