అమెజాన్ లో ‘ఇంటిదొంగ’, హైదరాబాదీ సహా ఆరుగురిపై నేరారోపణ

అమెరికాలోని అమెజాన్ లో ఓ భారతీయుడు, ఇండియన్ అమెరికన్ సహా ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి. యుఎస్ గ్రాండ్ జ్యూరీ వీరిని విచారించనుంది. అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు...

అమెజాన్ లో 'ఇంటిదొంగ', హైదరాబాదీ సహా ఆరుగురిపై నేరారోపణ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2020 | 10:32 AM

అమెరికాలోని అమెజాన్ లో ఓ భారతీయుడు, ఇండియన్ అమెరికన్ సహా ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి. యుఎస్ గ్రాండ్ జ్యూరీ వీరిని విచారించనుంది. అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు వీరు అమెజాన్ సంస్థ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు సుమారు లక్ష డాలర్లను ముడుపులుగా చెల్లించారని, కుట్రకు పాల్పడ్డారని  తెలుస్తోంది. 2017 నుంచి ఈ అక్రమార్కుల దందా కొనసాగుతోంది. వీరు  థర్డ్ పార్టీ మర్చంట్స్ ..అనధికారిక కంప్యూటర్ వ్యవస్థ ద్వారా కాంపిటీటర్లకు, వినియోగదారులకు హాని కలిగే విధంగా తమ వస్తువులనే అమ్మడానికి ప్రయత్నించారని అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. ఈ ఆరుగురిలో హైదరాబాద్ కు చెందిన 31 ఏళ్ళ నిషాద్ కుంజు, కాలిఫోర్నియాకు చెందిన 27 ఏళ్ళ రోహిత్ కడిమిశెట్టి, న్యూయార్క్ కు చెందిన ముగ్గురు, జార్జియాకు చెందిన ఒకరు ఉన్నారని తెలిసింది. వచ్ఛేనెల 15 న ఈ ఆరుగురిని సీటెల్ లోని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేటుగాళ్లు పది మంది అమెజాన్ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు లంచాలు చెల్లించి కుట్రకు పాల్పడినట్టు యుఎస్ అటార్నీ బ్రియాన్ మోరాన్ తెలిపారు. తమ నేరాన్ని వీరు అంగీకరించారని అయన చెప్పారు.