లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్

ముంబయి: దాదాపు తొమ్మిది రోజుల నష్టాల తర్వాత దేశీయ సూచీలు బుధవారం భారీ లాభాలను గడించాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా లోహ, ఇన్‌ఫ్రా, ఐటీ, బ్యాంక్‌, ఆటో, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో స్టాక్‌మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. ఉదయం 190 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ను ఆరంభించింది. అటు నిఫ్టీ 10,650 […]

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:38 PM

ముంబయి: దాదాపు తొమ్మిది రోజుల నష్టాల తర్వాత దేశీయ సూచీలు బుధవారం భారీ లాభాలను గడించాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా లోహ, ఇన్‌ఫ్రా, ఐటీ, బ్యాంక్‌, ఆటో, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో స్టాక్‌మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది.

ఉదయం 190 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ను ఆరంభించింది. అటు నిఫ్టీ 10,650 పైనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ చివరి గంటలో పరుగులు పెట్టింది. అదానీ పోర్ట్స్‌, వేదాంత షేర్లు భారీ లాభాల్లో పయనించడం మార్కెట్లకు కలిసొచ్చింది. చివరి గంటలో కొనుగోళ్లు వెలువెత్తడంతో సెన్సెక్స్‌ 403.65 పాయింట్లు లాభపడి 35,756.26 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 131.10 పాయింట్లు లాభపడి 10,735.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.08 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు దాదాపు 6 శాతం లాభపడ్డాయి. టాటా స్టీల్‌, వేదాంత లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో షేర్లు భారీగా లాభపడగా.. డా.రెడ్డీస్‌, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.