ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం.. ఇక ఏప్రిల్‌ 14 వరకు..

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా  రైళ్ల రాకపోకలను రద్దు.. ఇండియన్ రైల్వే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 14 వరకు అన్ని రిజర్వేషన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆన్‌లైన్‌ సహా.. అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో రిజర్వేషన్లు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నిర్ణయాన్ని కూడా..  ఏప్రిల్‌ 12వ […]

ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం.. ఇక ఏప్రిల్‌ 14 వరకు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 26, 2020 | 3:59 PM

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా  రైళ్ల రాకపోకలను రద్దు.. ఇండియన్ రైల్వే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్‌ 14 వరకు అన్ని రిజర్వేషన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆన్‌లైన్‌ సహా.. అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో రిజర్వేషన్లు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నిర్ణయాన్ని కూడా..  ఏప్రిల్‌ 12వ తేదీ తర్వాతే ప్రకటిస్తామని రైల్వే శాఖ తెలిపింది.

కాగా.. రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి.. టికెట్ ధర మొత్తాన్ని రిటర్న్ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 15 వ తేదీల మధ్యకాలంలో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం రైల్వే శాఖ చేసింది.