Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పోలీసుల అదుపులో 25 మంది స్ట్రీట్ ఫైటర్లు.. పండుగ్యాంగ్ లొ గుంటూరు, మంగళగిరి చెందిన యువకులు ఉన్నట్టు తేల్చినా పోలీసులు.. పాతనేరస్థుల పైనా అనుమానాలు..
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) లోని సిబ్బందికి కరోనా పాజిటివ్. దాదాపు 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. డీఎంఆర్‌సీ అధికారులు.
  • విశాఖ: క్రికెట్ గ్రౌండ్లో కత్తిపోట్లు. మూలపేట మైదానంలో యువకుల మధ్య వివాదం వ్యవహారం. ఆసుపత్రిలో నిలకడగా సాయి ఆరోగ్యం. 3 గంటలపాటు శ్రమించి వైద్యం చేసిన డాక్టర్లు. కత్తిపోటుకు విరిగిన దవడ కిందభాగం.. సాయి ముక్కు, నుదుటిపైనా గాయాలు.. చాతీ, వీపుపైనా కత్తిగాట్లు. దవడలో 6 సెంటీమీటర్ల వెడల్పు.. 3 సెంటీమీటర్ల లోతు గాయం. ఆందోళనలో కుటుంబసభ్యులు. సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సూర్య నుంచి మాకు ప్రాణ భయముంది.. : సాయి కుటుంబ సభ్యులు. పోలీసుల అదుపులో నిందితుడు సూర్య.
  • అమరావతి డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పోస్ హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ. సుధాకర్ పిటిషన్ ను అనుమతించిన కోర్టు హాస్పిటల్ superendent అనుమతి తో సుధాకర్ డిశ్చార్జ్ కావచ్చు సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్ ను ఆదేశించిన కోర్టు.

ఈ చిన్న పని చేస్తే.. రైల్వే స్టేషన్‌లో టికెట్ ఫ్రీ!

ఇక నుంచి రైల్వేస్టేషన్‌లో ఈ చిన్న పని చేస్తే.. టికెట్‌ ఫ్రీగా తీసుకోవచ్చు.! ఏంటా మంచి ఆఫర్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. ఈ విషయాన్ని సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ చేసిన ట్వీట్..
Indian Railways Introduces Machines That Give Free Platform Tickets, ఈ చిన్న పని చేస్తే.. రైల్వే స్టేషన్‌లో టికెట్ ఫ్రీ!

ఇక నుంచి రైల్వేస్టేషన్‌లో ఈ చిన్న పని చేస్తే.. టికెట్‌ ఫ్రీగా తీసుకోవచ్చు.! ఏంటా మంచి ఆఫర్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. ఈ విషయానికి  సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫుల్లు వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఆ ట్వీట్‌ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఫిట్‌నెస్ మిషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ మిషన్ ముందు కాసేపు సిటప్స్ (గుంజీలు) 30 తీస్తే ఉచితంగా ఫ్లాట్‌ ఫాం టికెట్ వస్తుంది. ఇంకేముంది.. ‘ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బుకి డబ్బు సేవ్’ అవుతున్నాయన్నమాట. భలేగా ఉంది కదా ఆఫర్. పొదుపును ప్రోత్సహించేందుకు ఇలా వినూత్న ప్రయోగాన్ని తీసుకొచ్చామని గోయెల్ పేర్కొన్నారు. ఇప్పటికే రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి పద్దతులనే అవలంభిస్తున్నాయని, త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా వీటిని తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Related Tags