దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. పెరిగిన రికవరీ రేటు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

India Corona: భారత్‌లో గత 24 గంటల్లో 7,79,377 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,144 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. పెరిగిన రికవరీ రేటు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 11:08 AM

India Corona: భారత్‌లో గత 24 గంటల్లో 7,79,377 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,144 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,57,985కి చేరింది. ఇక కొత్తగా 17,170 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,00,75,950కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.58 శాతానికి పెరిగింది.

మరోవైపు, గడిచిన 24 గంటల్లో 181 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,52,274కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,08,826కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,352 కేంద్రాల్లో 1,91,181 మందికి టీకా ఇచ్చారు. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందారు.

సూర్యాపేటలో ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమాయణం.. లవ్ చేయకపోతే చచ్చిపోతానని బెదిరించి యువతిపై అఘాయిత్యం..