సంపన్నుల జాబితాలో తెలుగువారి హవా.. ఎవరంటే..?

ప్రముఖ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌( ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్) వెల్త్‌ హూరన్‌ భారత కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో వరుసగా ఎనిమిదోసారి ముఖేశ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ అక్షరాలా రూ. 3,80,700 కోట్లు. ఇక రూ. 1,86,500 కోట్ల సంపదతో హిందుజా కుటుంబం సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉంది. విప్రో వ్యవస్థాపకుడు అజిమ్‌ ప్రేమ్‌జీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,17,100 కోట్లు. ఎర్సెలార్‌మిత్తల్‌ ఛైర్మన్‌ […]

సంపన్నుల జాబితాలో తెలుగువారి హవా.. ఎవరంటే..?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2019 | 10:36 AM

ప్రముఖ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌( ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్) వెల్త్‌ హూరన్‌ భారత కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో వరుసగా ఎనిమిదోసారి ముఖేశ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ అక్షరాలా రూ. 3,80,700 కోట్లు.

ఇక రూ. 1,86,500 కోట్ల సంపదతో హిందుజా కుటుంబం సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉంది. విప్రో వ్యవస్థాపకుడు అజిమ్‌ ప్రేమ్‌జీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,17,100 కోట్లు. ఎర్సెలార్‌మిత్తల్‌ ఛైర్మన్‌ ఎల్‌ఎన్‌ మిత్తల్‌(సంపద రూ. 1,07,300 కోట్లు) నాలుగో స్థానంలో, గౌతమ్‌ అదానీ(సంపద రూ. 94,500కోట్లు) ఐదో స్థానంలో నిలిచారు. ఉదయ్‌ కొటక్‌, సైరస్‌ ఎస్‌ పూనావాలా, పల్లోంజి మిస్త్రీ, షాపూర్‌ పల్లోంజి, దిలీప్‌ షంఘ్వీ టాప్‌ 10లో చోటు దక్కించుకున్నారు. అటు టాప్ 100లో నలుగురు తెలుగువారు చోటు దక్కించుకోవడం విశేషం.

ఇక మన దేశంలో శ్రీమంతుల సంఖ్య  పెరిగిందని ఐఐఎఫ్‌ఎల్‌ నివేదిక తెలిపింది. 2018 సంవత్సరంలో రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారు 831 మంది ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 953కు పెరిగింది. టాప్‌ 25 స్థానాల్లో ఉన్న సంపన్నుల మొత్తం సంపద మన దేశ జీడీపీలో 10శాతానికి సమానమని నివేదిక పేర్కొంది.

మరోవైపు తెలంగాణాలో సంపన్నుల లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. ఆరోబిందా ఫార్మా చైర్మన్ పి.వి.రామ్ ప్రసాద్ రెడ్డి(రూ.14,800 కోట్లు) 51వ స్థానంలో, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్టర్స్ ప్రమోటర్ పి.వి.రెడ్డి(రూ.13,400 కోట్లు) 57వ స్థానంలో, మరో ప్రమోటర్ పి.వి. కృష్ణారెడ్డి(రూ. 12,900 కోట్లు) 63వ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా 83వ స్ధానంలో దివీస్ కిర‌ణ్‌, 89వ స్ధానంలో దివీస్ నీలిమ‌లు తెలుగు రాష్ట్రాల నుంచి సత్తాచాటారు.

కె.సతీష్ రెడ్డి(రూ.7000 కోట్లు) 129వ స్థానంలో, జి.వి.ప్రసాద్, జి అనురాధ(రూ.5900 కోట్లు) 154వ స్థానంలో నిలవగా.. ఎమ్.సత్యనారాయణ రెడ్డి(రూ.5600 కోట్లు) 163వ స్థానంలో నిలిచారు. ఇకపోతే బి.పార్ధసారధి రెడ్డి, వి.సి. నన్నపనేని ఇరువురూ కూడా (రూ. 5200 కోట్లు) 174వ స్థానాన్ని పంచుకున్నారు. ఇక మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు(రూ.4500 కోట్లు) 195వ స్థానాన్ని దక్కించుకున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో