పిల్లులు కాదు పులులు..!

ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ జట్టు అద్భుత విజయంతో ఆరంభించింది. ఆదివారం ఓవల్ వేదికగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మిగతా ప్రత్యర్థులకు మేము పిల్లులు కాదు పులులు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ముష్ఫికర్‌ రహీమ్‌ (78; 80 బంతుల్లో 8×4), షకిబ్‌ అల్‌హసన్‌ (75; 84 బంతుల్లో 8×4, 1×6), సౌమ్య సర్కార్‌ (42; 30 బంతుల్లో 9×4), మహ్మదుల్లా […]

పిల్లులు కాదు పులులు..!
Follow us

|

Updated on: Jun 03, 2019 | 6:46 AM

ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ జట్టు అద్భుత విజయంతో ఆరంభించింది. ఆదివారం ఓవల్ వేదికగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మిగతా ప్రత్యర్థులకు మేము పిల్లులు కాదు పులులు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ముష్ఫికర్‌ రహీమ్‌ (78; 80 బంతుల్లో 8×4), షకిబ్‌ అల్‌హసన్‌ (75; 84 బంతుల్లో 8×4, 1×6), సౌమ్య సర్కార్‌ (42; 30 బంతుల్లో 9×4), మహ్మదుల్లా (46 నాటౌట్‌, 33 బంతుల్లో 3×4, 1×6) సత్తా చాటడంతో నిర్ణేత 50 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ బౌలర్లలో తాహిర్(2/57), మోరిస్(2/73), ఫెలుక్వాయో(2/52) మాత్రమే రాణించారు.

భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా  సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. కెప్టెన్ డుప్లెసిస్ (62; 53 బంతుల్లో 5×4, 1×6) ఒంటరి పోరాటం చేసినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 309 పరుగులే చేసింది. ముస్తాఫిజుర్‌ (3/67), సైఫుద్దీన్‌ (2/57), మెహదీ హసన్‌ మిరాజ్‌ (1/44), షకిబ్‌ (1/50) కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థులను కట్టడి చేశారు. ఇక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించిన షకీబ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.