క్రికెట్ ప్రియులకు శుభవార్త… కామన్వెల్త్ గేమ్స్‌లోకి మహిళల జట్టుకు రీ ఎంట్రీ

కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌కు రీ ఎంట్రీ లభించింది. 2022లో నిర్వహించే కామన్వెల్త్‌ మహిళల టీ20 క్రికెట్‌ పోటీలకు అర్హత ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లాండ్‌ సహా వరుసగా అత్యధిక ర్యాంకుల్లో కొనసాగుతున్న...

క్రికెట్ ప్రియులకు శుభవార్త... కామన్వెల్త్ గేమ్స్‌లోకి మహిళల జట్టుకు రీ ఎంట్రీ
Indian womens cricket
Follow us

|

Updated on: Nov 18, 2020 | 8:37 PM

Womens Cricket : కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌కు రీ ఎంట్రీ లభించింది. 2022లో నిర్వహించే కామన్వెల్త్‌ మహిళల టీ20 క్రికెట్‌ పోటీలకు అర్హత ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లాండ్‌ సహా వరుసగా అత్యధిక ర్యాంకుల్లో కొనసాగుతున్న ఆరు జట్లకు నేరుగా అర్హత లభిస్తుంది.

నాలుగేళ్లకు ఒకసారి జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో 1998లో పురుషుల క్రికెట్‌ భాగమైంది. కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో క్రికెట్‌ పోటీలు పెట్టారు. ఆ తర్వాత నిలిపివేశారు. మళ్లీ ఇన్నేళ్లకు మహిళల క్రికెట్ రూపంలో కామన్వెల్త్ క్రీడల్లో భాగస్వామ్యం లభించింది.

కామన్వెల్త్‌ క్రికెట్‌ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఎలాగూ చోటు ఉంటుంది. ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లోని జట్లకు నేరుగా అర్హత లభిస్తుంది. మిగిలిన ఆ ఒక్క జట్టునూ తర్వాత ప్రకటించనున్నారు.

2022, జనవరి 31లోపు జరిగే అర్హత పోటీల్లో విజేతకు చోటు లభిస్తుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా‌ క్రికెట్‌ మ్యాచులు జరుగుతాయి. ఇప్పటివరకు కరీబియన్‌ దీవులు ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ తొలి ఆరు స్థానాల్లో గనక నిలిస్తే మరో జట్టుకు అవకాశం దొరకనుందని సమాచారం.