ఏపీ స‌ర్కార్ నిర్ణయం.. కొవిడ్ చికిత్సల పర్యవేక్ష‌ణ‌కు సీనియర్ ఐఏఎస్​లు

క‌రోనా క‌ట్ట‌డి దిశ‌గా ఏపీ స‌ర్కార్ కీల‌క అడుగులు వేస్తోంది. టెస్టులో చేయ‌డంలో ఇప్ప‌టికే ముందున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం..బాధితుల‌కు మెరుగైన చికిత్స నిమిత్తం కీల‌క నిర్ణ‌యం తీసు‌కుంది.

ఏపీ స‌ర్కార్ నిర్ణయం..  కొవిడ్ చికిత్సల పర్యవేక్ష‌ణ‌కు సీనియర్ ఐఏఎస్​లు
Follow us

|

Updated on: Jul 16, 2020 | 4:18 PM

క‌రోనా క‌ట్ట‌డి దిశ‌గా ఏపీ స‌ర్కార్ కీల‌క అడుగులు వేస్తోంది. టెస్టులో చేయ‌డంలో ఇప్ప‌టికే ముందున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం..బాధితుల‌కు మెరుగైన చికిత్స నిమిత్తం కీల‌క నిర్ణ‌యం తీసు‌కుంది. క్వారంటైన్, కొవిడ్ కంట్రోల్ సెంట‌ర్స్, ఐసోలేష‌న్ కేంద్రాల్లో సౌకర్యాల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్‌లకు అప్ప‌గించింది. ఈ మేర‌కు ఆర్జా శ్రీకాంత్, కన్నబాబుల‌కు ఆదేశాలు అందాయి. అన్ని సెంట‌ర్ల‌లో వైద్యేతర వసతులపై నిరంతరం పర్యవేక్షించాలని ప్ర‌భుత్వం వార‌ని ఆదేశించింది.

ఇతర రాష్ట్రాల ప్రయాణికుల వివరాల నమోదు, మోన‌ట‌రింగ్ చేయాలని సూచించింది. స్పందన ప‌ర్మిష‌న్స్.. గ్రామ, వార్డు స్థాయిలో అందుతోన్న వైద్య‌సేవ‌ల‌ను పర్యవేక్షించాలని పేర్కొంది. వైద్యశాఖ అధికారులతో నిరంత‌రం సమన్వయం చేసుకుని బాధితుల‌కు ఇబ్బందుల లేకండా సమస్యలు పరిష్కరించాలని ఆదేశాల్లో దిశానిర్దేశం చేసింది.