మంత్రి పదవి పై చూపు..? : భూమన కరుణాకర్ రెడ్డి

Bhumana Karunakar Reddy, మంత్రి పదవి పై చూపు..? : భూమన కరుణాకర్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. తిరుపతికి ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమని చెప్పిన ఆయన.. ఇలాంటి బాంబ్ పేల్చడం పార్టీలో కలకలం రేపుతోంది. అయితే తానిలా ప్రకటించడానికి గల కారణాన్ని మాత్రం భూమన వెల్లడించలేదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భూమన అత్యంత సన్నిహితుల్లో ఒకరన్న విషయం తెలిసిందే. అందుకే తిరుపతిలో టికెట్ కోసం పెద్దగా ఎవరూ ప్రయత్నాలు చేయలేదు. టికెట్‌ను ఈజీగా దక్కించుకున్న ఆయనకి గెలుపు మాత్రం అంత సులభం కాలేదు. ఎందుకంటే, భూమనపై జనాల్లోనూ పార్టీ నేతల్లోనూ కూడా బాగా వ్యతిరేకత ఉంది. ఇక భూమన గెలుపు కోసం పార్టీ నేతలు పెద్దగా సహకరించకపోవడంతో.. ఆయన నానా అవస్తలు పడ్డారు. ఈ నేపధ్యంలో శనివారం జరగబోయే మంత్రివర్గ విస్తరణ ముందు భూమన ఇలాంటి ప్రకటన చేయడం వెనుక ఏదైనా మైండ్ గేమ్ ఉందా అని పార్టీలోని కొందరు నేతలు అనుకుంటున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కోసమే ఇలా ప్లాన్ వేశారా అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *