పూరీ, ఛార్మీపై కేసు పెడతానంటోన్న కమెడియన్

దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మీపై కేసు పెడతానంటున్నాడు ఓ కమెడియన్. అయితే అతడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలలో నటించిన వాడు కావడం ఓ విశేషం. ఇంతకు ఎవరా కమెడియన్..? పూరీ, ఛార్మీపై ఆ కమెడియన్ ఎందుకు కేసు పెట్టాలనుకుంటున్నారు..?

డాక్టర్ నుంచి కమెడియన్‌గా అవతారమెత్తిన భద్రం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా పూరీ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్‌‌ను భద్రం చూశాడట. అయితే ఈ సినిమా చూసినప్పటి నుంచి అతడు మెడిటేషన్ చేయడం లేదట. దీన్ని ఓ ట్వీట్‌లో తెలిపిన భద్రం.. పూరీ- ఛార్మీ మీద కేసు ఫైల్ చేస్తా. అయినా కొన్ని మెడిటేషన్ క్లాసులు మిస్ అవ్వడం కూడా మంచిదే. ఈ ఇస్మార్ట్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి అని కామెంట్ చేశాడు.

కాగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. బీ, సీ థియేటర్లలో ఇరగదీస్తున్నాడు. ఫుల్ మాస్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం మాస్ వర్గాలను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో కలెక్షన్లలోనూ జోరు చూపిస్తున్నాడు ఇస్మార్ట్ శంకర్. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *