ప్ర‌తి వ‌ర‌ద బాధిత కుటుంబానికి ఇంటి వ‌ద్ద‌కే సిఎం రిలీఫ్ కిట్‌

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద‌ల ముందున్న సాదార‌ణ స్థితికి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల‌ను ఆదేశించారు.

ప్ర‌తి వ‌ర‌ద బాధిత కుటుంబానికి ఇంటి వ‌ద్ద‌కే సిఎం రిలీఫ్ కిట్‌
Follow us

|

Updated on: Oct 17, 2020 | 6:30 PM

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద‌ల ముందున్న సాదార‌ణ స్థితికి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌తో క‌లిసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి దిశానిర్ధేశం చేశారు.  ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆదేశాల మేర‌కు ఇస్తున్న సి.ఎం రిలీఫ్ కిట్‌ల‌ను వ‌ర‌ద బాదిత కుటుంబాల ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి అంద‌జేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రూ. 2,800 విలువ గ‌ల సి.ఎం రిలీఫ్ కిట్‌లో ఒక నెల‌కు స‌రిప‌డ నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు 3 బ్లాంకెట్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. వ‌ర‌ద ప్రాంతాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌చ్చే అన్ని చ‌ర్య‌ల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ( రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ ! )

అందుకు స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. యాంటి లార్వా స్ప్రేయింగ్‌, సోడియం హైపోక్లోరైట్, క్రిమీసంహార‌క ద్రావ‌నాల‌ను అన్ని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పిచికారి చేయించాల‌ని ఆదేశించారు. ఎంట‌మాల‌జి బృందాల ద్వారా కెమిక‌ల్స్ స్ప్రే చేయించాల‌ని సూచించారు. స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌, స్ప్రేయింగ్‌కు అవ‌స‌ర‌మైతే అద‌నంగా వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్రాంతాల్లో నిలిచిన నీళ్ల‌ను తొల‌గించుట‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న నాలాలు, రోడ్ల‌పై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బుర‌ద‌ను, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు, శిథిలాల‌ను తొల‌గించుట‌కు అవ‌స‌ర‌మైన సిబ్బందిని, అద‌నపు వాహ‌నాల‌ను వినియోగించాల‌ని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌తో పాటు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మొబైల్ మెడిక‌ల్ క్యాంపుల‌ను ఏర్పాటు చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై న‌మ్మ‌కాన్ని క‌లిగించాల‌ని తెలిపారు. మొబైల్ మెడిక‌ల్ క్యాంపుల నిర్వ‌హణ‌లో జిహెచ్ఎంసితో పాటు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని వైద్య ఆరోగ్య శాఖ డి.ఎం.ఇ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌కు సూచించారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌తో దెబ్బ‌తిన్న ఇళ్ల ఎన్యుమ‌రేష‌న్‌ను చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ( హైదరాబాద్‌‌లో‌ మళ్ళీ దంచి కొడుతోన్న భారీ వర్షం )

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!