హైదరాబాద్‌‌లో‌ మళ్ళీ దంచి కొడుతోన్న భారీ వర్షం

హైదరాబాద్‌లో ఇటీవల వర్షాలు దంచికొట్టాయి. గత 100 ఏళ్లలో నగరంలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరద కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

హైదరాబాద్‌‌లో‌ మళ్ళీ దంచి కొడుతోన్న భారీ వర్షం
Follow us

|

Updated on: Oct 17, 2020 | 6:15 PM

హైదరాబాద్‌లో ఇటీవల వర్షాలు దంచికొట్టాయి. గత 100 ఏళ్లలో నగరంలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరద కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. వర్షాలు తగ్గిపోవడంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలుకుంటున్నాయి. కాగా రెండ్రోజులు పాటు  గ్యాప్ ఇచ్చిన వర్షాలు హైదరాబాద్‌లో మళ్లీ దంచి కొడుతున్నాయి. కొద్ది సేపటి నుంచి నగరంలోనే పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది.  లక్డీ కపూల్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ‌ ప్రాంతాల్లో భారీ వర్షం మొదలయింది. అమీర్‌ పేట, పంజా గుట్ట, కూకట్‌ పల్లి మొదలగు చోట్ల కూడా కుండ పోత కురుస్తుంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ( రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ ! )

ఇక మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో  అక్టోబర్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు, ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.  ( సాగర తీరాన..సతీ సమేతంగా )