AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Production: చక్కెర ఉత్పత్తిలో భారత్‌ది రెండో స్థానం..అగ్ర స్థానం ఏ దేశానిదో తెలుసా..?

World Sugar Production: ప్రపంచ చక్కెర ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. చెరకు సాగులో భారత్‌కు ఉన్న విస్తారమైన వనరులు, చక్కెర పరిశ్రమ కారణంగా ప్రపంచ మార్కెట్‌లో దేశానికి కీలక స్థానం ఉంది. అయితే ప్రపంచంలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే దేశం ఏది? భారత్, చైనా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం.

Sugar Production: చక్కెర ఉత్పత్తిలో భారత్‌ది రెండో స్థానం..అగ్ర స్థానం ఏ దేశానిదో తెలుసా..?
World Sugar Production
Janardhan Veluru
|

Updated on: Oct 01, 2026 | 5:06 PM

Share

రోజువారీ జీవితంలో చక్కెరను ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా పండుగలు, ఆహార పరిశ్రమ, పానీయాల తయారీ వంటి రంగాల్లో చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో చక్కెర ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలో చెక్కెర కేజీ రూ.70కి చేరుకుంది. చక్కర ధర నేరుగా సామాన్యుడి జోబుపై ప్రభావం చూపుతుంది. చక్కర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా చక్కెరను ఉత్పత్తి (World Sugar Production) చేస్తున్న దేశం ఏది? భారత్ ఏ స్థానంలో ఉంది? పాకిస్థాన్ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

అగ్రస్థానంలో బ్రెజిల్.. రెండో స్థానంలో భారత్

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చెక్కరలో సుమారు 80 శాతం చెరకు నుండి, మిగిలిన 20 శాతం చక్కెర దుంప (Sugar Beet) నుంచి వస్తుంది. బ్రెజిల్, భారత్ వంటి దేశాల్లో చెరకు ఆధారిత చక్కెర పరిశ్రమకు పెద్ద ప్రాధాన్యం ఉంది. చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రపంచంలోనే మొదటి స్థానం (అందుబాటులో ఉన్న 2024-25 గణాంకాల మేరకు)లో కొనసాగుతోంది. ప్రపంచ చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ వాటా సుమారు 22-24 శాతంగా ఉందని భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక పేర్కొంది. సుమారు 16 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రధానంగా చక్కెర దుంపల నుండి చక్కెరను ఉత్పత్తి చేసే యూరోపియన్ యూనియన్ మూడో స్థానంలో ఉంది. చైనా, థాయ్‌లాండ్, అమెరికా తదుపరి మూడు స్థానాల్లో ఉన్నాయి.

టాప్-10 దేశాలు ఇవే..

ప్రపంచ చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ 44.39 మిలియన్ టన్నులతో మొదటి స్థానంలో ఉంది. భారత్ 35.25 మిలియన్ టన్నులతో రెండో స్థానంలో ఉంది. యూరోపియన్ యూనియన్ 15.49 మిలియన్ టన్నులతో మూడో స్థానంలో ఉండగా, చైనా 11.50 మిలియన్ టన్నులతో నాలుగో స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ 10.25 మిలియన్ టన్నులతో ఐదో స్థానంలో, అమెరికా 8.48 మిలియన్ టన్నులతో ఆరో స్థానంలో ఉంది. రష్యా 6.50 మిలియన్ టన్నులతో ఏడో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 6.21 మిలియన్ టన్నులతో ఎనిమిదో స్థానంలో ఉంది. మెక్సికో 5.40 మిలియన్ టన్నులతో తొమ్మిదో స్థానంలో, ఆస్ట్రేలియా 4 మిలియన్ టన్నులతో పదో స్థానంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

భారత్‌లో అనేక రాష్ట్రాల్లో చెరకు సాగు విస్తృతంగా జరుగుతోంది. దీంతో దేశం ప్రపంచ చక్కెర మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు దేశంలోని ప్రధాన చెరకు ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి. 2025-26లో దేశ చెరకు ఉత్పత్తి 500 మిలియన్ టన్నులకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా సమాచారం వెల్లడించింది.

పాకిస్థాన్ స్థానమిదే..?

పాకిస్థాన్ చక్కెర ఉత్పత్తిలో భారత్ కంటే చాలా వెనుకబడి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆ దేశ చక్కెర ఉత్పత్తి సుమారు 6.21 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. ప్రపంచ చెక్కర ఉత్పత్తిలో పాకిస్థాన్ వాటా సుమారు 3-4 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే, చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ ఆధిపత్యం కొనసాగుతుండగా, భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది. పాకిస్థాన్ మాత్రం టాప్-10లో ఎనిమిదో స్థానంలో ఉంది.

Follow Us