Crime News: బర్త్ డే సెలబ్రేషన్స్ కి దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను కొట్టి చంపిన మహిళ!

|

Nov 25, 2023 | 5:30 PM

మహిళలకు పుట్టిన రోజులన్నా, పెళ్లి రోజులన్నా చాలా ఇంపార్టెంట్. అవి రెండూ మిస్ అయితే వారి కోపం మామూలుగా ఉండదు. అయితే కొందరు అలుగుతారు.. మరి కొందరు మాత్రం ఏదో ఓ నాలుగు రోజులు మాట్లాడకుండా ఉంటారు. ఇది కామన్ గా జరిగే విషయం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. బర్త్ డే సెలబ్రేషన్స్ కు దుబాయ్ తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టింది ఓ మహిళ. అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేని భర్త మరణించాడు. ఈ ఘటన పుణేలోని వనవాడి ప్రాంతంలోని ఓపోష్..

Crime News: బర్త్ డే సెలబ్రేషన్స్ కి దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను కొట్టి చంపిన మహిళ!
Crime News
Follow us on

మహిళలకు పుట్టిన రోజులన్నా, పెళ్లి రోజులన్నా చాలా ఇంపార్టెంట్. అవి రెండూ మిస్ అయితే వారి కోపం మామూలుగా ఉండదు. అయితే కొందరు అలుగుతారు.. మరి కొందరు మాత్రం ఏదో ఓ నాలుగు రోజులు మాట్లాడకుండా ఉంటారు. ఇది కామన్ గా జరిగే విషయం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. బర్త్ డే సెలబ్రేషన్స్ కు దుబాయ్ తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టింది ఓ మహిళ. అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేని భర్త మరణించాడు. ఈ ఘటన పుణేలోని వనవాడి ప్రాంతంలోని ఓపోష్ రెసిడెన్షియల్ సొసైటీలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళ్తే..

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. నిఖిల్ ఖన్నా(35) అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం రేణుక అనే యువతితో వివాహం జరగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నాడు. ఇటీవల యువతి తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని దుబాయ్ లో చేయాలని కోరింది. దీనికి నిఖిల్ నిరాకరించాడు. ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. కానీ అందుకు నిఖిల్ ససేమిరా అన్నాడు. భార్య రేణుకను.. నిఖిల్ దుబాయ్ తీసుకెళ్లక పోవడంతో దంపతుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి.

దుబాయ్ కి తీసుకెళ్లలేదని భర్తను కొట్టిన భార్య:

భార్య రేణుక ప్రవర్తనతో నిఖిల్ విసుగెత్తి పోయాడు. ఇదే సమయంలో నిఖిల్.. తమ సమీప బంధువుల పుట్టిన రోజుల వేడుకలకు ఢిల్లీ వెళ్లి అక్కడే ఉన్నాడు. తన బర్త్ డే వేడుకలను నిరాకరించడంతో గత కొద్ది రోజుల నుంచి తీవ్ర మనస్తాపంతో రగిలి పోయింది భార్య రేణుక. ఇక శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చాడు నిఖిల్. అదే రోజు ఈ విషయంలో వీరిద్దరి మధ్య మళ్లీ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తగాదాలో సహనం కోల్పోయిన రేణుక.. భర్త నిఖిల్ ముఖంపై దాడి చేసింది. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావం అయి అక్కడికక్కడే మృతి చెందాడు నిఖిల్. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.