స్మార్ట్‌ఫోన్ మన జీవితాన్ని స్మార్ట్‌గా చేయడమే కాదు.. అప్పుడప్పుడూ ప్రాణాల పోయే పరిస్థితిని కూడా తెచ్చిపెడుతుంది. కొందరు ఫోన్ మైకంలో పడి చుట్టూ ఏం జరుగుతోందన్నది అసలు పట్టించుకోరు. అలా తమ లైఫ్‌ని రిస్క్‌లో పెడుతుంటారు. ‘అధికంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఆరోగ్యానికి హానికరం’ అని చెప్పినా.. ఎవ్వరూ పట్టించుకోరు. అందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోను చూడగానే మీకేం అనిపిస్తుంది.. పట్టాలపై గూడ్స్ రైలు వెళ్తోందని అందరూ ఠక్కున చెప్పేస్తారు. అయితే మీరు కాస్త వీడియోను తీక్షణంగా చూస్తే.. ట్రైన్ కింద ఓ అమ్మాయి కనిపిస్తుంది..! మీకు కనిపించిందా.? అవునండీ ఓ అమ్మాయి ట్రైన్ కింద పడుకుని తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఇలా అని మీరు అనుకుంటే పొరపాటే.. వీడియో చివర్లో ఆమె ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది. ఇప్పటికైనా మీకు అర్దమైంది కదా.! ‘అక్కకు పాణం కంటే ఫోన్ కాల్ ముఖ్యం’ అని లెక్క.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
ट्रेन आती-जाती रहेगी लेकिन कॉल नहीं कटना चाहिए ?? pic.twitter.com/x72ARehBvU
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 28, 2022