Vastu Tips: ఇంట్లో నిత్యం గొడవలా.? ఈ వాస్తు దోషాలున్నాయా చూసుకోండి..

కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు, ఇంట్లో అశాంతికి కూడా వాస్తు దోషాలు కారణమవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే కొన్ని దోషాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఇంట్లో గొడవాలకు, మానశ్శాంతి లేకపోవడానికి కారణమయ్యే ఆ వాస్తు దోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: ఇంట్లో నిత్యం గొడవలా.? ఈ వాస్తు దోషాలున్నాయా చూసుకోండి..
Vastu Tips
Follow us

|

Updated on: May 14, 2024 | 2:00 PM

మనలో వాస్తును విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి. అందుకే ఇంటి నిర్మాణం మొదలు, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు వాస్తు విషయంలో పక్కా జాగ్రత్తలతో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలిసో, తెలియకో కొన్ని వాస్తు తప్పులను చేస్తుంటాం. వీటివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వాస్తు దోషాల వల్ల కేవలం ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా మానసిక సంబంధిత సమస్యలు సైతం వెంటాడుతుంటాయి.

కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు, ఇంట్లో అశాంతికి కూడా వాస్తు దోషాలు కారణమవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే కొన్ని దోషాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఇంట్లో గొడవాలకు, మానశ్శాంతి లేకపోవడానికి కారణమయ్యే ఆ వాస్తు దోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో శుభ్రత లేకుండా ఇంట్లో ఉండే వారి మానసిక స్థితిపై ప్రభౄవం పడుతుందని వాస్తు పండుతులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇల్లంతా చెత్తా చెదారంతో నిండిపోతే మంచిది కాదని చెబుతున్నారు. అందుకే ప్రతీ రోజూ కచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

* ఇక ఇంట్లో ఈశాన్యం మూలకు ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో చెత్తా చెదరం లేకుండా చూసుకోవాలి. అలాగే ఈశాన్యం మూలలో భారీ వస్తువులు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* ఇక ఇంట్లో సాలెపెరుగులు గూళ్లు పెడితే వెంటనే తొలగించాలని చెబుతున్నారు. ఇవి ఎక్కువగా ఉంటే ఇంట్లో తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడంతో పాటు, మనశ్శాంతి దూరమవుతుందని అంటున్నారు. అందుకు ఇంటిని సాలెపురుగులు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఏర్పడే బూజును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

* ఈశాన్యం మూలన పొరపాటున కూడా బాత్‌రూమ్‌ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే మాత్రం దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య బంధాలు దూరమవుతాయని చెబుతున్నారు.

* కొందరు ఇంట్లో అవసరంలేని చెత్తతో నింపేస్తుంటారు. పాత న్యూస్‌ పేపర్లు, పాడైన వస్తువులను అలాగే భద్ర పరుస్తుంటారు. అయితే దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉపయోగం లేని వస్తువులను ఇంట్లో ఉంచుకోకపోవడమే మంచిది.

* కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా మెట్ల కింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది మెట్ల కింద ప్రదేశాన్ని చెత్తతో నింపేస్తుంటారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వస్తువులను తొలగించాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువరు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్