Photo Puzzle: మాయా లేదు.. మంత్రం లేదు.. ఈ ఫోటోలో రహస్యాన్ని కనిపెడితే మీరే తోపు..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మీ కళ్లకు పదునుపెట్టే ఇంటరెస్టింగ్ ఫోటో పజిల్స్. వాటిని సాల్వ్ చేయడంలో..

Photo Puzzle: మాయా లేదు.. మంత్రం లేదు.. ఈ ఫోటోలో రహస్యాన్ని కనిపెడితే మీరే తోపు..
Photo Puzzle

Updated on: Nov 15, 2022 | 9:16 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మీ కళ్లకు పదునుపెట్టే ఇంటరెస్టింగ్ ఫోటో పజిల్స్. వాటిని సాల్వ్ చేయడంలో భలే ఫన్ ఉంటుంది. ఫోటోల నుంచి పెయింటింగ్ వరకు.. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. నెట్టింట తెగ వైరల్ అవ్వొచ్చు. పైపైన ఫోటోను చూసినంత మాత్రాన మీకు ఆన్సర్ తెలియదు. నిశితంగా పరిశీలిస్తేనే దానిలో దాగున్న రహస్యాన్ని కనిపెట్టొచ్చు. ఇవి అటుంచితే.. మరికొన్ని ఆప్టికల్ ఇల్యూషన్స్ మీ వ్యక్తిత్వ లక్షణాలను బయటపెడతాయని సైకాలజిస్టులు అంటారు. ఇంకొన్ని మీ పరిశీలనా నైపుణ్యాలను, ఐక్యూని పరీక్షించగలవు. తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం. దీనిలో ఉన్న రహస్యాన్ని 8 సెకన్లలో కనిపెడితే మీరే తోపు..

పైన పేర్కొన్న ఫోటోలో మీరు ఆకులు, పువ్వులు చూడవచ్చు. అయితే అక్కడే ఓ కప్ప దాగుంది. మంచి పరిశీలనా నైపుణ్యం ఉన్న వ్యక్తి మాత్రమే ఆకుల మధ్య దాక్కున్న కప్పను గుర్తించగలడు. కానీ ఎక్కువ సమయం తీసుకోకండి. 15 సెకన్ల పాటు టైమర్‌ను సెట్ చేసి, ఫోటో పజిల్‌ను సాల్వ్ చేయండి. మీరు కప్పను గమనించారా? 8 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు. ఫోటోను నిశితంగా చూసి సమాధానాన్ని కనిపెట్టండి. ఒకవేళ దొరక్కపోతే కింద ఫోటో చూడండి.