Married Woman: కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా..? ఎన్నో ఆసక్తికర విషయాలు

Married Woman: ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా గుర్తుకువచ్చేగా గూగుల్‌. ఇందులో ఏదికావాలన్నా సెర్చ్‌ చేయాగానే ఇట్టే వివరాలు వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు సమాచారం కోసం గూగుల్‌లో..

Married Woman: కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా..? ఎన్నో ఆసక్తికర విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 29, 2022 | 12:29 PM

Married Woman: ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా గుర్తుకువచ్చేగా గూగుల్‌. ఇందులో ఏదికావాలన్నా సెర్చ్‌ చేయాగానే ఇట్టే వివరాలు వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంటారు. ఇక అమ్మాయిల జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది. పెళ్లి అయిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. భర్తతో జీవితం ఎలా ఉంటుంది.. అత్తవారింట్లో జీవనం ఎలా కొనసాగుతుందనే అంశాలపై చాలా ఆలోచిస్తుంటారు. మహిళలు పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత తమ అత్త మామలు, భర్త, కుటుంబ సభ్యులతో మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు.

అయితే పెళ్లాయిన తర్వాత అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతుకుతారోనని పరిశోధకులు కొన్ని అధ్యయనాలు నిర్వహించారు. ఇందులో ఆశ్చర్చపోయే నిజాలు బయటకు వచ్చాయి. పెళ్లయిన కొత్తలో ఎక్కువగా గూగుల్‌ మీద ఆధారపడుతున్నారని స్పష్టమైంది. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు గూగుల్‌ వాడకం ఎక్కువైపోయింది. ఏ విషయం గురించి అయినా గూగుల్‌లో సెర్చ్‌ చేయాల్సిందే. పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

  1. భర్తకు ఆకర్షణీయంగా కనిపించాలంటే..: వివాహం చేసుకున్న అమ్మాయి తన భర్తకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుందట. భర్తకి ఏ విధంగా ఆకర్షణీయంగా కనింపించాలనే దానిపై పెళ్లయిన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్నట్లు అధ్యయనం ద్వారా తేలింది
  2. భర్త ఇష్టాలు.. అయిష్టాలు..: కొత్తగా పెళ్లయిన ప్రతి మహిళ తమ భర్త ఏ విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారని గూగుల్ సెర్చ్‌లో వెతుకుతున్నారు. అదేవిధంగా భర్తలకు ఏది ఇష్టం, ఏది అయిష్టం అనే విషయాలు తెలుసుకోవడం కోసం సెర్చ్ చేస్తున్నారట.
  3. ఇవి కూడా చదవండి
  4. భర్త మనసును గెలుచుకోవడం: పెళ్లయిన తర్వాత భర్త మనసును ఏ విధంగా గెలుచుకోవాలన్న దానిపై గూగుల్‌లో వెకుతుతున్నారట. భర్తతో ఏ విధంగా మెలగాలి, అతని మనసుని ఎలా మెప్పించాలి.. ఇలా రకరకాలుగా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారట.
  5. కుటుంబ సభ్యుల మెప్పు పొందడం: చాలా పెళ్లయిన అమ్మాయిలు అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత అత్తమామల మనసును గెలుచుకోవడం ఎలా అనే దానిపై ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నారని స్పష్టమైంది. కుటుంబ సభ్యులు అందరికి నచ్చేవిధంగా వంటకాలు ఏ విధంగా చేయాలని, వారిని ఆకర్షించడం లాంటి వాటిపై సెర్చ్‌ చేస్తున్నారట.
  6. కుటుంబ బాధ్యత: పెళ్లయిన తర్వాత తమ కుటుంబ బాధ్యలు ఎలా చూసుకోవాలి. కుటుంబానికి అండగా నిలబడేందుకు ఏం చేయాలనేదానిపై గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నారని అధ్యయనాల ద్వారా తేల్చారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి