Indian Restaurant: కువైట్‌లో భారతీయ రెస్టారెంట్ కొంపముంచిన సోషల్ మీడియా ప్రమోషన్..!

కువైట్‌లో అనుమతి లేకుండా ఇండియన్ రెస్టారెంట్ నడుస్తోందని స్థానిక అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రెస్టారెంట్ యజమానితోపాటు ఉద్యోగిని అరెస్ట్ చేశారు.

Indian Restaurant: కువైట్‌లో భారతీయ రెస్టారెంట్ కొంపముంచిన సోషల్ మీడియా ప్రమోషన్..!
Indian Restaurant Kuwait
Follow us

|

Updated on: Jun 24, 2024 | 12:00 PM

కువైట్‌లో అనుమతి లేకుండా ఇండియన్ రెస్టారెంట్ నడుస్తోందని స్థానిక అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రెస్టారెంట్ యజమానితోపాటు ఉద్యోగిని అరెస్ట్ చేశారు. కువైట్‌లో సీక్రెట్‌గా నడుస్తున్న ఇండియన్ రెస్టారెంట్‌ని అధికారులు కనుగొన్నారు. ఈ రెస్టారెంట్‌ను భారతీయ పౌరుడు నడుపుతున్నాడు. ఇందులోకి పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారు. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కారణంగా, ఇది బహిర్గతమైంది.

కువైట్‌లోని సాల్మియాలో నివాస భవనంలో ఒక భారతీయ పౌరుడు ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ, రెస్టారెంట్ యజమాని టిక్‌టాక్‌లో ఒక ప్రకటన చేశాడు. దీనిని చూసిన అక్కడి పోలీసులు, స్థానిక అధికారులు ఈ అక్రమ రెస్టారెంట్ గురించి సమాచారాన్ని అందుకున్నారు. దాడి అనంతరం యాజమాన్యాన్ని, ఉద్యోగులను పోలీసులు పట్టుకుని భారత్‌కు పంపించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కువైట్‌లో భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి రెస్టారెంట్ స్టార్ చేసిన యజమాని, ఇందు కోసం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకున్నాడు. ఈ ప్రకటననే అతని కొంపముంచింది. ఈ రెస్టారెంట్ ప్రమోషన్ కోసం ఒక భారతీయ టిక్‌టాక్ సెలబ్రిటీని నియమించారు. వీడియో ప్రసారం అయిన తర్వాత, ప్రకటన అనుకోకుండా కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చేరింది. ఆ తర్వాత వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది కువైట్ బ్లాగర్లు కూడా దీన్ని షేర్ చేశారు. రెస్టారెంట్ సీక్రెట్ లొకేషన్‌ను బయటపెట్టడంలో యజమానుల పొరపాటుపై పలువురు నెటజన్లు మండిపడుతున్నారు.

గల్ఫ్ న్యూస్ ప్రకారం, ఈ రెస్టారెంట్ చట్టవిరుద్ధంగా నడుస్తోంది. దీని కారణంగా కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్య తీసుకుంది. ఆ తర్వాతే కువైట్ పోలీసులు రెస్టారెంట్‌పై దాడి చేశారు. తనిఖీల్లో అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. రెస్టారెంట్‌లో ప్రభుత్వ సబ్సిడీ సరుకులు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రతా నియమాలు పాటించలేదు. అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ వాసన వ్యాపించింది. ఈ కారణంగా, రెస్టారెంట్‌ను మూసివేయమని అధికారులు ఆదేశించారు. రెస్టారెంట్ యాజమాని సాల్మియా పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. మిగిలిన వారిని స్థానిక చట్టాలను ఉల్లంఘించినందుకు భారత్‌కు తిప్పి పంపించారు.

మరిన్ని  అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్