International Women’s Day 2021: మహిళలకు ఆదర్శంగా నిలిచిన 5 వెబ్ సిరీస్.. మీరు చూసేయ్యండి..

International Women's Day 2021: ఒకప్పుడు ఆడవాళ్లు వంటగదికి, పడక గదికి అంకితమై పురుషాహంకారానికి బలవుతు జీవచ్ఛవంలా బతికేవారు. సృష్టికి మూలమైన ఆడవాళ్ల జీవితాలు

International Women's Day 2021: మహిళలకు ఆదర్శంగా నిలిచిన 5 వెబ్ సిరీస్.. మీరు చూసేయ్యండి..
Follow us

|

Updated on: Mar 06, 2021 | 7:38 PM

International Women’s Day 2021: ఒకప్పుడు ఆడవాళ్లు వంటగదికి, పడక గదికి అంకితమై పురుషాహంకారానికి బలవుతు జీవచ్ఛవంలా బతికేవారు. సృష్టికి మూలమైన ఆడవాళ్ల జీవితాలు నరకంగా వున్న తరుణంలో కొంతమంది సంఘ సంస్కర్తల పోరాటాల పుణ్యమాని మహిళల పట్ల జరుగుతున్న దురాచారాలు అంతరించాయి. కాలంతోపాటు మార్పులు మొదలై, పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో ఆడవారు దూసుకుపోతున్నారు. ఇక మహిళల్లలో ఉండే దైర్యాన్ని తెరపై చూపిస్తున్నారు. తెరపై చూసే మహిళలు మన విధిని నిర్ణయించే వ్యక్తిగా ప్రోత్సహించే, శక్తినిచ్చే, ప్రేరేపించే పాత్రలలో జీవిస్తున్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా స్వతంత్రంగా, ఆర్థికంగా, బలంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మహిళా తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనే నేపథ్యంలో ఈమద్య కాలంలో డిజిటర్ తెరపై అలరించిన సినిమాల సంఖ్య భారీగానే ఉంది. అందులో కొన్ని వెబ్ సిరీస్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

తారా ఫ్రమ్ మేడ్ ఇన్ హేవెన్ (అమెజాన్)..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తారా ఫ్రమ్ మేడ్ ఇన్ హేవెన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ శోభితా ధులిపాలా చిత్రీకరించారు. ఇందులోని స్త్రీ ముఖ్యంగా భయంలేకుండా ఉండడం, ప్రాక్టికల్, అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉంటూంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోంటూ ఏ విధంగా ముందుకు సాగుతుందనేది చూడవచ్చు. సమస్యలను ఎదుర్కోంటున్న ఆమె చివరకు వాటిని ఎలా నెగ్గింది అనేది చూడవచ్చు.

ఆర్య ఫ్రమ్ ఆర్య (Hotstar)..

ఈ వెబ్ సిరీస్‏ను రామ్ మద్వానీ, సందీప్ మోడి నిర్మించారు. ఇందులో ప్రధాన పాత్రలో సుష్మితా సేన్ నటించింది. తన పిల్లల కోసం వెతుకుతున్న తల్లి పాత్రలో నటించింది. ఇది హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సుష్మిత తల్లి పాత్రలో జీవించిందని చెప్పుకోవచ్చు. ఇందులో నిరాశ, ద్రోహం, ప్రేమ, కోపం కలిసి ఈ వెబ్ సిరీస్ ను అందంగా చిత్రీకరించారు.

మసాబా ఫ్రమ్ మసాబా మసాబా (నెట్ ఫ్లిక్స్)..

నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఈ మసాబా మసాబా వెబ్ సిరీస్ నీనా గుప్తా, ఆమె కూతురు ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా నక్షత్రాల చుట్టూ ఉంటుంది. ఫ్యాషన్ రంగంలో తమ ఖాతాదారుల నుంచి ఎదురయ్యే సవాల్లను ఎదుర్కోవడానికి మసాబా చేసే ప్రయత్నాలను ఇందులో చూడవచ్చు. తాను ఎంచుకున్న రంగంలో ఎదురయ్యే సవాల్లను అధిగమిస్తూ.. తానను తాను ఎలా నిరూపించుకుందనేది ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం.

మోనికా ఫ్రమ్ కోడ్ M(ALT బాలాజీ)..

ALT బాలాజీ, ZEE5 సంయుక్తంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ టెలివిజన్ స్టార్ జెన్నిఫర్ వింగెట్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇందులో భారతీయ న్యాయవాదీ మోనికా పాత్రను పోషిస్తుంది. సైనికుల ఎన్ కౌంటర్లో కుట్రం పన్నాగం మధ్యలో మోనికాను తీర్పు ఇవ్వాలి. తీర్పు వ్యతిరేకంగా రాకుండా ఉండేందుకు శత్రువులు వేసే పన్నాగాలను, తనకు ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవడం. ఒక మిలటరీ న్యాయవాదీ ఎదుర్కోనే సవాళ్లను ధీటుగా ఎలా ఎదుర్కోవాలో ఈ సిరీస్ ద్వారా నెర్చుకోవచ్చు.

ఉమాంగ్ ఫ్రమ్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)..

కీర్తి కుల్హారీ, సయాని గుప్తా, మాన్వి గాగ్రూ, బానీ జె అనే నలుగురు స్వతంత్రంగా జీవించే మహిళల మధ్యగల స్నేహబంధాన్ని ఇందులో చూడోచ్చు. ఒంటరిగా జీవించే మహిళ, ద్విలింగసంపర్కం, శరీరాకృతిని అంగీకరించలేకపోవడం అనే అంశాలతో తెరకెక్కింది. ఉమాంగ్ తన శరీరాకృతిని అంగీకరించడానికి తన స్నేహితులను పొందే మద్దతు.. సమాజంలో ఆమె పట్ల కలిగే నియమనిబంధనలకు దాటుకొని ఎలా లైంగిక వేధింపుల నుంచి బయటపడిందనేది ఈ సిరీస్.

Also Read:

నోరూరించే చింతకాయ నువ్వుల పచ్చడి.. టెస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు… ఎలా చేసుకోవాలంటే..