Viral video : నీటి బావిలో పడిన నాగుపాము… ప్రాణాలకు తెగించి కాపాడిన యువకులు.. వీడియో వైరల్

|

Feb 16, 2021 | 9:50 PM

సాధారణంగా పామును చూస్తేనే పరుగులుపెడతాం మనం..  నాగుపాము మనల్ని చూసి బుసకొడితే ... ఇంకేమైనా ఉందా గుండెలు గుభేలుమంటాయ్. అలాంటిది ఓ పాముకు

Viral video : నీటి బావిలో పడిన నాగుపాము... ప్రాణాలకు తెగించి కాపాడిన యువకులు.. వీడియో వైరల్
Follow us on

SNAKE RESCUE : సాధారణంగా పామును చూస్తేనే పరుగులుపెడతాం మనం.. నాగుపాము మనల్ని చూసి బుసకొడితే … ఇంకేమైనా ఉందా గుండెలు గుభేలుమంటాయ్. అలాంటిది పాముకు సంబందించిన ఈ వీడియో మాత్రం క్షణక్షణం ఉత్కంఠ కలిగించేలా ఉంది. బావిలో పడిన పామును కాపాడేందుకు కొందరు యువకులు చేసిన సాహసం ఒళ్లుగగుర్లుపొడిచేలా చేసింది. నార్మల్‌గా పాములను కాపాడే వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం.. అయితే విషపూరితమైన భారీ పాములను కాపాడటం అంటే చాలా రిస్క్‌. అయితే పాములను కాపాడేవారు, కొంతమంది జంతు ప్రేమికులు.. కష్టాల్లో ఉన్న వాటిని రక్షిస్తారు. తాజాగా చోటుచేసుకున్న ఘటన కూడా అలాంటిదే.

బావిలో పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ భారీ పామును కొందరు యువకులు ప్రాణాలకు తెగించి కాపాడారు. పామును కాపాడేందుకు ఓ వ్యక్తి బావిలోకి దూకితే.. మరొకరు బావి గోడకు ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీల సాయంతో నీటి సమీపంలో నిలబడ్డాడు. నీటిలో ఈత కొడుతున్న పామును స్టిక్ పట్టేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం ఓ వ్యక్తి నీటిలో దూకి.. ఆ పాముపై నీళ్లు చల్లుతూ..ఇనుప కడ్డీలపై నిలబడి ఉన్న వ్యక్తి వద్దకు పాము వెళ్లేలా దాని దారి మళ్లించేందుకు ప్రయత్నించాడు. కాసేపటికి ఇనుప కడ్డీలపై నిల్చున్న వ్యక్తి వద్దకు పాము దగ్గరగా వెళ్లింది. దీంతో వెంటనే అతడు దాన్ని కడ్డీతో పట్టుకొని జాగ్రత్తగా బావి ఒడ్డుపైకి తీసుకెళ్లాడు. తర్వాత ఆ పామును ఓ ప్లాస్టిక్ బాటిల్​లో భద్రపరిచి.. స్వేచ్ఛగా అడవిలో వదిలేశారు. పామును సాహసోపేతంగా కాపాడిన ఈ వీడియోను సోషల్ మీడియాలో  వైరల్​గా మరి తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.