Eyes Close While Kissing: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూస్తారు? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

|

Mar 18, 2023 | 5:40 PM

భాగస్వామి పట్ల తమ ప్రేమను వ్యక్తీకరించడానికి ఉత్తమ మార్గం ముద్దు. భావోద్వేగాలతో నిండిన ‘ముద్దు’ ఇద్దరు భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. వారిని మరింత దగ్గర చేస్తుంది.

Eyes Close While Kissing: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూస్తారు? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
Couple Kiss
Follow us on

భాగస్వామి పట్ల తమ ప్రేమను వ్యక్తీకరించడానికి ఉత్తమ మార్గం ముద్దు. భావోద్వేగాలతో నిండిన ‘ముద్దు’ ఇద్దరు భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. వారిని మరింత దగ్గర చేస్తుంది. అయితే, ప్రేమికులు గానీ, భార్యభర్తలు గానీ ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకోవడం చూస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటే కళ్లు మూసుకోవడం సినిమాల్లోనూ చూస్తాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ దానికి గల కారణం ఏంటో మనం తెలుసుకుందాం..

శాస్త్రీయ కారణాలు..

లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన రాయల్ హోలోవే.. దృష్టి, స్పర్శకు సంబంధించి ఇంద్రియ అనుభవంపై ఒక అధ్యయనంలో కీలక విషయాలను కనిపెట్టారు. భాగస్వామిని ముద్దుపెట్టుకునే సమయంలో మరే ఇతర ఇంద్రియాలపై దృష్టి పెట్టడం సాధ్యమవదని కనిపెట్టారు పరిశోధకులు. మనస్తత్వవేత్తలు సాండ్రా మర్ఫీ, పాలీ డాల్టన్.. ‘స్పర్శ భావన’ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రయోగాత్మక సైకాలజీ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం.. భాగస్వాములు పెదవులను ముద్దుపెట్టుకునే సమయంలో వారి కళ్ళు మూసుకుంటారని వెల్లడించారు. కారణంగా ఆ ముద్దులో పూర్తిగా మునిగిపోవడమే. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు బాహ్య విషయాలు దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ కారణంగా ముద్దు పెట్టుకునేటప్పుడు.. ప్రజలు తమ భాగస్వామికి భద్రత, పూర్తి సహకారాన్ని అందించాలని కోరుకుంటారట. ఆ కారణంగానే ఆటోమాటిక్‌గా ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు మూస్తారట.

పెదాలను ముద్దుపెట్టుకుంటూ విజువల్ టాస్క్..

ఈ పరిశోధనలో భాగంగా కొందరు భాగస్వాములకు ఒక టాస్క్ ఇచ్చారు పరిశోధకులు. చదువుతూ తమ భాగస్వామికి ముద్దు పెట్టుకోవాలి. అలా ముద్దు పెట్టుకుంటూ కొన్ని అక్షరాలు చదవడమే టాస్క్. అయితే, ఇది చేయడం జంటలకు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. ముద్దు పెట్టుకుంటూ చదవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఈ అధ్యయనం ప్రకారం.. కళ్లు తెరిచి ఉంచడం వలన స్పర్శ భావనను పొందలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మనస్తత్వవేత్తల ప్రకారం.. ముద్దు పెట్టుకునేటప్పుడు వ్యక్తి మనస్సు ఒకే సమయంలో రెండు విషయాలపై దృష్టి పెట్టలేదు. పెదవులను ముద్దుపెట్టుకునే సమయంలో ప్రజలు స్పర్శ అనుభూతిపై దృష్టి పెడతారు. పెదవిపై ముద్దు సమయంలో ఇతర ప్రతిచర్యపై దృష్టి పెట్టడానికి వారు ఇష్టపడరు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..