Vastu Tips: ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.. వాస్తు శాస్త్రం ఇదే చెబుతోంది..

మన వస్తువులను ఇతరులతో పంచుకోవడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇతరులకు ఇస్తే ఆర్థికంగా, ఆరోగ్యంగా సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. కొన్ని రకాల వస్తువులను ఇతరులతో పంచుకుంటే మీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని...

Vastu Tips: ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.. వాస్తు శాస్త్రం ఇదే చెబుతోంది..
Pen
Follow us

|

Updated on: Jul 21, 2024 | 9:41 PM

మన వస్తువులను ఇతరులతో పంచుకోవడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇతరులకు ఇస్తే ఆర్థికంగా, ఆరోగ్యంగా సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. కొన్ని రకాల వస్తువులను ఇతరులతో పంచుకుంటే మీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పండితులు చెబుతోన్న దాని బట్టి ఇతరులతో పంచుకోకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పండితుల అభిప్రాయం ప్రకారం చెప్పులు, బూట్లను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ పంచుకోకూడదు. కాళ్లు శని దేవుడి స్థానంగా చెబుతుంటారు. అందుకే ఒకరి చెప్పులను మరొకరు ధరించడం వల్ల శని దోషాన్ని ప్రేరేపిస్తుందని చెబుతుంటారు. దీని వల్ల పేదరికం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు.

* ఇక ఇతరులతో పంచుకోకూడని మరో వస్తువు ఆభరణాలు. ముఖ్యంగా బంగారం అభరణాలను మరొకరికి ఇవ్వడం వల్ల మీ సంపద వారికి ఇచ్చినట్లవుతుందని పండితులు చెబుతున్నారు.

* పండితుల అభిప్రాయం మీ పెన్నును ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. మీ జేబులోని పెన్నును పక్కనివారికి ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని చెబుతుంటారు.

* ఇక మొక్కలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంట్లో పెరుగుతున్న మొక్కలను ఇతరులకు ఇస్తే మీ ఇంట్లోని శక్తిని ఇతరులకు ఇచ్చినట్లు అవుతుంది. అందుకే వీలైనంత వరకు నర్సరీల్లో కొనుగోలు చేసుకోవడమే బెటర్‌. అయితే ఇలా మొక్కలను తీసుకున్న వారికి కూడా మంచిది జరగదని నిపుణులు చెబుతున్నారు.

* ఇంట్లోని ఉప్పును కూడా ఎట్టి పరిస్థితుల్లో పక్కని వారికి అరువుగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. కాబట్టి ఉప్పును కానీ పసుపును కానీ ఎవరికీ ఇవ్వకూడదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింట్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..