21 July 2024
గ్లామరస్ పాత్రలలో నటించకపోవడానికి కారణం అదే.. ఐశ్వర్య రాజేశ్..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాది చిత్రపరిశ్రమలో విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్.
ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిన్నవయసులోనే ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది ఈ హీరోయిన్.
కాక్కా ముట్టై చిత్రంలో తల్లి పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేశ్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇందులో తల్లి పాత్రకు జీవం పోశారు ఐశ్వర్య.
ఆ సినిమానే ఐశ్వర్య కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. కానీ ఆమెకు తెలుగులో కాకుండా కేవలం తమిళంలోనే వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఐశ్వర్య రాజేశ్‌కు కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో మూవీ అవకాశాలు తగ్గినట్లుగా తెలుస్తోంది.
కొద్ది రోజులుగా ఐశ్వర్య తన ఇన్ స్టాలో గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా గ్లామర్ పాత్రలలో నటించడంపై రియాక్ట్ అయ్యింది ఐశ్వర్య.
గ్లామరస్ రోల్స్ ఆఫర్స్ తనకు వచ్చాయని.. కానీ వాటిని ఒప్పుకోలేదని.. తనకు తగిన పాత్రలలో నటించడమే తనకు ఇష్టమని అన్నారు ఐశ్వర్య.
గ్లామరస్‌గా నటించడం తనకు తగదని.. అందుకే గ్లామరస్ పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపించడం లేదని నటనకు అవకాశం ఉండాలని అన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.