Vastu Tips: వంటింట్లో మీరు చేసే ఈ తప్పులు.. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ తీస్తాయి..

ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతుంటారు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో ఇబ్బందులు...

Vastu Tips: వంటింట్లో మీరు చేసే ఈ తప్పులు.. మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ తీస్తాయి..
Vastu Tips
Follow us

|

Updated on: Jun 10, 2024 | 10:41 AM

ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతుంటారు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండకూడదు.? వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన లేదా పాడైపోయిన పాత్రలను వంటగదిలో ఉంచకూడదు. ఇలాంటి పాత్రలు ప్రతికూల శక్తికి చిహ్నాలు. వంటగదిలో వాటిని ఉపయోగించడం వల్ల గ్రహాల స్థానంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. విరిగి పాత్రలో తినడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

* ఇక వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో చెత్త, మురికి ఉండే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తు పండితులు అంటున్నారు. ఇది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని హశ్రీచ్చరిస్తున్నారు.

* వాస్తు ప్రకారం, కత్తి ప్రతికూల శక్తికి చిహ్నం. అందుకే ఉపయోగం లేని సమయంలో కత్తులు లేదా కొడవలి వంటి వాటిని తెరిచి ఉంచకూడదని చెబుతున్నారు. వీటివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది.

* కిచెన్‌లో ఉండే సింక్‌ ట్యాప్ వాటర్‌ లీక్‌ అవుతుంటే వెంటనే సరిచేసుకోండి. కుళాయి నుంచి నీరు కారడం డబ్బు వృధాకు కారణమవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో ట్యాప్‌ లీక్‌ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

* వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో మురిగిపోయిన ఆహార పదార్థాలను ఉంచకూడదు. వీటి వల్ల అనారోగ్య సమస్యలే కాకుండా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

* ఇక ఎవరైతే ఇంట్లో ఆహారాన్ని వృధా చేస్తారో వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఆహారం వృధా కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

* వంట గదిలో యుద్ధాలు, హింసకు సంబంధించి చిత్రాలు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్