Eiffel Tower: మీకు ఈ విషయం తెలుసా? ఆ సమయంలో ఈఫిల్ టవర్ ఫోటో తీస్తే నేరం.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

|

Jul 22, 2023 | 9:13 AM

పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ టవర్‌ని చూసేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పర్యాటకులు ఫ్రాన్స్‌కు వస్తుంటారు. దీనిని 1889లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ ఫెయిర్ ప్రవేశ ద్వారం నమూనాలో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేరుగాంచింది.

Eiffel Tower: మీకు ఈ విషయం తెలుసా? ఆ సమయంలో ఈఫిల్ టవర్ ఫోటో తీస్తే నేరం.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
Eiffel Tower
Follow us on

పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ టవర్‌ని చూసేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పర్యాటకులు ఫ్రాన్స్‌కు వస్తుంటారు. దీనిని 1889లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ ఫెయిర్ ప్రవేశ ద్వారం నమూనాలో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేరుగాంచింది. తరువాత ఈ టవర్‌ రికార్డ్‌ను బీట్ చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే, దాని అందం, ప్రజాదరణ ముందు ఏదీ నిలవలేదు. అయితే, ఈఫిల్ టవర్‌కు సంబంధించిన ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

2 సంవత్సరాలలో నిర్మాణం పూర్తి..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈఫిల్‌ టవర్‌ నిర్మాణానికి 2 సంవత్సరాల 2 నెలల 5 రోజులు పట్టింది. దీని నిర్మాణం 1887లో ప్రారంభించగా.. 1889లో పూర్తయ్యింది. ఈఫిల్ టవల్ నిర్మాణంలో 300 మందికి పైగా కార్మికులు పని చేసినట్లు రికార్డ్స్ చెబుతున్నారు. అత్యంత అరుదైన, నైపుణ్యాలు కలిగిన హస్తకళాకారుల సహాయంతో నిర్మించిన ఈఫిల్ టవర్.. పారిస్ అందాన్ని మరింత పెంచిందని చెప్పొచ్చు.

రాత్రి వేళ ఫోటో తీయడం నేరం..

ఈఫిల్ టవర్‌ను రాత్రి సమయంలో ఫోటో తియడం చట్టవరుద్ధం. ఈ మేరకు పారిస్ చట్టాలు చెబుతున్నాయి. ఈఫిల్ టవర్ లైట్స్ పారిస్ కాపీరైట్ కిందకు వస్తాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఎవరైనా రాత్రివేళ ఈఫిల్ టవర్‌ను ఫోటో తీయాలనుకుంటే కాపీరైట్ చట్టం ప్రకారం ముందుగా అక్కడి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు.

ఇవి కూడా చదవండి

యూపీఐ పేమెంట్స్‌ ద్వారా ఈఫిల్ టవర్‌ను సందర్శించొచ్చు..

పారిస్‌ను లవ్ సిటీ అంటారు. ఇందులో ఈఫిల్ టవర్.. ప్రేమ జంటలకు ప్రత్యేకమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ పాపులారిటీని చూసిన ప్రధాని మోదీ.. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశంలో యూపీఐ చెల్లుంపులు యాక్సెస్ ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఇది తొలిసారి పారిస్‌లోని ఈఫిల్ సందర్శన కోసం ఉపయోగించడం జరుగుతుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుండగా.. ఈఫిల్ టవర్ ఎంట్రీ ఫీజును యూపీఐ ద్వారా పే చేయొచ్చు.

ఎత్తు తగ్గుతున్న ఈఫిల్ టవర్..

శీతాకాంలో ఈఫిల్ టవర్ ఎత్తు కొంతమేర తగ్గిపోతుందట. దాదాపు 6 అంగుళాల వరకు తగ్గిపోతుంది. ఈఫిల్ టవర్‌ను లోహంతో తయారు చేయడంవలన.. చలి కాలంలో అది కుంచించుకుంటుంది. ఇక వేసవి కాలంలో యధావిధిగా ఉంటుందట. ఇక 1930లో న్యూయార్క్‌లో నిర్మించిన క్రిస్లర్ భవనం ఈఫిల్ టవర్‌ కంటే ఎత్తైనది.

ఈఫిల్ టవర్ జీవిత కాలం 20 సంవత్సరాలు..

వాస్తవానికి ఈఫిల్ టవర్ లైఫ్ టైమ్ 20 సంవత్సరాలు మాత్రమే. అంటే, 20 సంవత్సరాలు పూర్తయ్యాక దీనిని కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే, 20 ఏళ్ల తరువాత దానిని టెక్నికల్ టీమ్ టెస్ట్ చేయగా ఇలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు నిర్ధారించారు. అలా 20 ఏళ్ల కాల వ్యవధితో నిర్మించిన ఈ టవర్.. ఇప్పటికీ చాలా బలంగా నిలిచి ఉండటం విశేషం.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..