Cyclone Michaung: తుఫాన్లకు వింత పేర్లు ఎలా పెడతారో తెలుసా..? పెద్ద కథే ఉందిగా..

| Edited By: Srilakshmi C

Dec 04, 2023 | 3:12 PM

బంగాళాఖాతంలో అప్పుడప్పుడు తుఫాన్లు ఏర్పడుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తుఫాన్లు వచ్చినప్పుడు అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఒక్కోసారి ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంటుంది. తుఫాన్‌లు వచ్చినప్పుడు వాటికి ఒక్కో సారి ఒక్కో పేరు పెడుతూ ఉంటారు. తుఫాన్లు వచ్చిన ప్రతి సారి వాటికి పెట్లే పేర్లు కొత్తగా ఉంటాయి. ఆ తుఫాన్ల పేర్లు వింటే చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు ఈ తుఫాన్లుకు పేర్లు ఎవరు పెడతారు..? ఎలా పెడతారనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణ శాఖతోపాటు..

Cyclone Michaung: తుఫాన్లకు వింత పేర్లు ఎలా పెడతారో తెలుసా..? పెద్ద కథే ఉందిగా..
Cyclone Michaung
Follow us on

ఏలూరు, డిసెంబర్‌ 4: బంగాళాఖాతంలో అప్పుడప్పుడు తుఫాన్లు ఏర్పడుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తుఫాన్లు వచ్చినప్పుడు అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా ఒక్కోసారి ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా సంభవిస్తుంటుంది. తుఫాన్‌లు వచ్చినప్పుడు వాటికి ఒక్కో సారి ఒక్కో పేరు పెడుతూ ఉంటారు. తుఫాన్లు వచ్చిన ప్రతి సారి వాటికి పెట్లే పేర్లు కొత్తగా ఉంటాయి. ఆ తుఫాన్ల పేర్లు వింటే చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు ఈ తుఫాన్లుకు పేర్లు ఎవరు పెడతారు..? ఎలా పెడతారనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచవాతావరణ శాఖతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేస్తుంటాయి. అలాగే వీటి పేర్లను కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి. ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) కూడా ఒకటి. 13 సభ్య దేశాలకు చెందిన తుఫానులకు చెందిన సమాచారం అందించడం ఈ డిపార్ట్‌మెంట్‌ పని.

తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భారత్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, ఒమన్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక దేశాలు ఉన్నాయి. అయితే ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు.

2000వ సంవత్సరంలో 27వ సదస్సును మస్కట్‌, ఓమన్‌దేశాల్లో నిర్వహించారు. ఇందులో తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం జరిగింది. ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం ప్రారంభమైంది. అయితే బంగాళాఖాతం, అరేబియన్‌ సముద్రాల తీరంలో ఉన్న ఎనిమిది దేశాలను ముందుగా గుర్తించారు. ఇంగ్లీష్‌లోని ఆల్ఫబెటిక్ ఆర్డర్ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలను పొందుపర్చారు. అయితే ఢిల్లీలోని వాతావరణ కేంద్రం కొన్ని పేర్లను ముందుగానే నిర్ణయిస్తుంటుంది. రానున్న తుఫానుకు ఒక పేరును సూచించాలని సభ్యదేశాలను కోరుతుంది. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం తీరంలో ఉన్న సభ్య దేశాలకు పంపుతుంది. తుఫానులకు పేర్లుపెట్టడం వల్ల అధికారులు, శాస్త్రవేత్తలు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. తుఫాన్లకు పేరు పెట్టే సంస్కృతికి అమెరికా తెరలేపింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. మొత్తం 64 పేర్లను ఈ ఎనిమిది దేశాలు ఎంపిక చేయగా ఇప్పటికి 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా.. మలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా, నీలోఫర్‌ పాకిస్తాన్ పెట్టింది.

తుఫాన్ల పేర్లు పెట్టడంతో పాటించాల్సిన నిబంధనలు

  • ఈ తుఫాన్ల పేర్లు రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పెట్టేందుకు వీలు లేదు.
  • సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి.
  • తుఫాన్ల పేర్లలో క్రూరత్వం ఎక్కడ ఉండకూదు.
  • ఈ తుఫాన్ల పేర్లుపలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులభంగా ఉండేలా చూడాలి.
  • ఈ పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండరాదు.
  • పేరు ప్రతిపాదించడంతోపాటు దాని స్పెల్లింగ్‌, ఉచ్ఛారణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్య దేశాలదే.
  • సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.
  • ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు.
  • ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు పెట్టిన పేర్లను ఒక్కసారి మాత్రమే వాడాలి. మరోసారి వాడకూడదు.

దూసుకొస్తున్న మిచాంగ్ తుఫాన్

డిసెంబరు 3వ తేదీ 05.30 గంటల IST ఆధారంగా.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా తీవ్రరూపం దాల్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 06 గంటల్లో 5 kmph వేగంతో వాయువ్య దిశగా కదిలి, తుఫాను “MICHAUNG” గా మారింది. ఈరోజు డిసెంబర్ 3వ తేదీ IST 05.30 గంటలకు కేంద్రీకృతమై ఉంది. అదే ప్రాంతంలో అక్షాంశం 11.4°N మరియు రేఖాంశం 82.5°E, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 300 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 310 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 440 కి.మీ, బాపట్లకి 550 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా దక్షిణ-550 కి.మీ. మచిలీపట్నానికి ఆగ్నేయం కేంద్రీకృతమై ఉంది.

ఇది వాయువ్య దిశగా పయనిస్తూ, మరింత బలపడి, డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది దాదాపు ఉత్తరం వైపుకు దాదాపు సమాంతరంగా, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతూ, నెల్లూరు – మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని డిసెంబర్ 5వ తేదీ ముందురోజు తుఫానుగా దాటుతుంది. గరిష్టంగా గంటకు 80-90 కి.మీ వేగంతో 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మిచాంగ్ తుఫాన్‌గా మారి డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రానున్న 3-4 రోజుల పాటు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివ‌రించారు. మిచాంగ్‌ తుఫాను డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారుల అంచనా. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు ప‌డే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తుఫాను డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రానున్న 3-4 రోజుల పాటు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివ‌రించారు. మిచాంగ్‌ తుఫాను డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారుల అంచనా. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు ప‌డే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.