భారత దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారంటే..

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ తిప్పి కొట్టామని ప్రకటించాడు. అయితే భారత విమానాలు చేసిన బాంబుల దాడి ఖాళీ ప్రదేశంలో జరిగిందని, […]

భారత దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారంటే..
Follow us

|

Updated on: Feb 26, 2019 | 10:35 AM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ తిప్పి కొట్టామని ప్రకటించాడు. అయితే భారత విమానాలు చేసిన బాంబుల దాడి ఖాళీ ప్రదేశంలో జరిగిందని, ఎలాంటి నష్టం జరగలేదని, ఇతర సాంకేతిక అంశాల గురించి మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పాడు.

అయితే భారత్ వాయుసేనలు చేసిన దాడిలో సుమారుగా 200కి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే దీన్ని భారత ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు. పూర్తి వివరాలు, సరిహద్దులో ఉన్న పరిస్థితిపై పూర్తి స్థాయి పరిస్థితులు తెలియడానికి మరింత సమయం పట్టేలా ఉంది.