తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ వాయిదా..!

Telangana Municipal Elections, తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ వాయిదా..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ మళ్లీ వాయిదా పడింది. హైకోర్టులో పురపాలక ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఆర్డినెన్స్‌  -6ను కోర్టుకు అడిషనల్‌ అడ్వోకేట్‌ జనరల్‌ సమర్పించారు. పాత ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా..? కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా అని కోర్టు ప్రశ్నించగా..పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని నివేదించారు. కాగా ప్రభుత్వ కౌంటర్‌ దాఖలుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కౌంటర్‌లో పొందుపరిచిన అంశాలలో వాస్తవం లేదని వ్యాఖ్యానించింది. మున్సిపల్‌ ఎన్నికలపై ఇప్పటికే 606 అభ్యంతరాలు వస్తే వాటిని ఎప్పటి వరకు పరిష్కరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సమస్యలను పక్కన పెట్టి ఎన్నికలకు ఎలా వెళతారని నిలదీసింది. విచారణలో భాగంగా కౌంటర్‌లో పేర్కొన్నఅంశాలపై పూర్తి ఆధారాలను ఈ నెల 20 లోపు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21కి కోర్టు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *