ఇంతవరకు రీమేక్‌లో నటించని టాలీవుడ్ హీరోలు ఎవరంటే..!

రీమేక్‌లు అన్నవి ఏ ఇండస్ట్రీలోనైనా కామన్. కథ బావుంటే అందులో నటించేందుకు టాప్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతుంటారు. అప్పటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ.. ఆ తరువాతి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు కూడా పలు రీమేక్‌లలో నటించారు. ఇక ఇప్పటి టాప్ హీరోలను చూసుకుంటే ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, రామ్, నాగ చైతన్య‌లు కూడా రీమేక్ చిత్రాల్లో నటించారు. అయితే సూపర్‌స్టార్ మహేష్ బాబు(నాని బైలింగ్వల్ సినిమా), స్టైలిష్ స్టార్ అల్లు […]

ఇంతవరకు రీమేక్‌లో నటించని టాలీవుడ్ హీరోలు ఎవరంటే..!
Tollywood News
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 5:00 PM

రీమేక్‌లు అన్నవి ఏ ఇండస్ట్రీలోనైనా కామన్. కథ బావుంటే అందులో నటించేందుకు టాప్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతుంటారు. అప్పటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ.. ఆ తరువాతి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు కూడా పలు రీమేక్‌లలో నటించారు. ఇక ఇప్పటి టాప్ హీరోలను చూసుకుంటే ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, రామ్, నాగ చైతన్య‌లు కూడా రీమేక్ చిత్రాల్లో నటించారు. అయితే సూపర్‌స్టార్ మహేష్ బాబు(నాని బైలింగ్వల్ సినిమా), స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు మాత్రం రీమేక్‌లో నటించలేదు. మహేష్ బాబు ఇప్పుడు 26 మూవీలో.. అల్లు అర్జున్ 20వ చిత్రంలో నటిస్తుండగా.. వీరిద్దరి కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా లేకపోవడం విశేషం. ఇక వీరిని పక్కనపెడితే మిగిలిన వారు ఏఏ రీమేక్‌లలో నటించారంటే..

1.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(హిందీ సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్) 2. గోకుళంలో సీత(తమిళ్ సినిమా గోకులతిల్ సీతై) 3. సుస్వాగతం(తమిళ్ సినిమా లవ్ టుడే) 4. తమ్ముడు(ఇది రీమేక్ అవ్వనప్పటికీ.. హిందీలో విజయం సాధించిన జో జీతా వోమి సికిందర్ ఇన్ఫిరేషన్‌తో తెరకెక్కించారు) 5. ఖుషి(తమిళ్ సినిమా ఖుషి) 6. అన్నవరం(తమిళ్‌ చిత్రం తిరుపాచీ రీమేక్) 7. తీన్ మార్(హిందీ చిత్రం లవ్ ఆజ్ కల్) 8. గబ్బర్ సింగ్(హిందీ చిత్రం దబాంగ్) 9. గోపాల గోపాల(హిందీ చిత్రం ఓ మై గాడ్) 10. కాటమ రాయుడు(తమిళ్ చిత్రం వీరమ్)

1.యోగి(కన్నడ సినిమా యోగి) 2. బిల్లా( తమిళ్ సినిమా బిల్లా)

ధృవ(తమిళ్ చిత్రం తని ఒరువన్)

నరసింహుడు(కన్నడ చిత్రం దుర్గి)

మసాలా(హిందీ చిత్రం బోల్ బచ్చన్)

రవితేజ:

1.క్షేమంగా వెళ్లి లాభంగా రండి(తమిళ్ చిత్రం వైరలుక్కేత వీక్కమ్) 2.తిరుమల తిరుపతి వేంకటేశ(తమిళ్ చిత్రం తిరుపతి ఎళుమలై వెంకటేశ) 3. అమ్మాయి కోసం(తమిళ్ చిత్రం తుల్లి తురింత కాలమ్) 4. దొంగోడు(మలయాళ చిత్రం మీస మాధవన్) 5. వీడే(తమిళ చిత్రం ధూల్) 6. నా ఆటోగ్రాఫ్( తమిళ చిత్రం ఆటోగ్రాఫ్) 7. శంభో శివ శంభో(తమిళ్ చిత్రం నాదోడిగల్)

1.భీమిలి కబడ్డీ జట్టు(తమిళ్ చిత్రం వేన్నిల కబడీ కుళు) 2. అహ కల్యాణం(హిందీ చిత్రం బ్యాండ్ బజా బరాత్)

1.తడాఖా(తమిళ్ చిత్రం వేట్టై) 2. ప్రేమమ్(మలయాళ చిత్రం ప్రేమమ్)

1.క్లాస్ మేట్స్(మలయాళ చిత్రం క్లాస్‌మేట్స్) 2. నువ్వా నేనా(హిందీ చిత్రం దీవానా మస్తానా) ఇప్పుడు శర్వానంద్ తమిళ్‌లో విజయం సాధించిన 96రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

1.అభిమన్యు(కన్నడ చిత్రం అభి) 2.విజయదశమి(తమిళ చిత్రం విజయకాశి)

గద్దలకొండ గణేష్(తమిళ్ చిత్రం జిగర్తాండ).

1.కిర్రాక్ పార్టీ(కన్నడ చిత్రం కిర్రీక్ పార్టీ) 2.అర్జున్ సురవరం(తమిళ్ రీమేక్ కణిథన్)- విడుదలకు సిద్ధంగా ఉంది.