ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు

రాగల మూడు రోజుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి  భారీ వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని దీనికి అనుబంధముగా 4.5 కి.మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అదే విధంగా తూర్పుమధ్య అరేబియా సముద్రం నుండి విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు తెలంగాణ మీదుగా 2.1 కి. మీ.ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు […]

ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 11:56 AM

రాగల మూడు రోజుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి  భారీ వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని దీనికి అనుబంధముగా 4.5 కి.మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అదే విధంగా తూర్పుమధ్య అరేబియా సముద్రం నుండి విదర్భ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు తెలంగాణ మీదుగా 2.1 కి. మీ.ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మరో మూడు రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

అదే విధంగా ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో ప్రజలకు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది.